Manoj Birthday : తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఇద్దరు తమ బర్త్ డేలని ఘనంగా జరుపుకుంటున్నారు.వీరిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అయితే మరొకరు మంచు మనోజ్.ఇక ఇప్పటికే తారక్ తన డ్రాగన్ గ్లిమ్ప్స్ తో నెట్టింట్లో మంటలు పుట్టించగా, మనోజ్ కూడా ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే అప్ డేట్స్ తో ఆడియన్స్ ని ఫుల్ ఖుషీ చేశాడు.
‘వడ్డీకాసులవాడ’ అనే క్రేజీ టైటిల్‌తో అనౌన్స్
ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తూనే మరోవైపు తనదైన శైలిలో హీరోగా కూడా ఆడియన్స్ ని అలరిస్తున్నాడు మనోజ్.ఈ క్రమంలోనే ‘వడ్డీకాసులవాడ’ అనే క్రేజీ టైటిల్‌తో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఒక అద్భుతమైన టీజర్ ద్వారా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
also read :‘పెద్ది’ రిలీజ్ ముందు టాలీవుడ్‌లో పర్సంటేజ్ చిచ్చు.. సునీల్ నారంగ్ అవుట్..అసలు కారణం అదేనా?
గత కొద్దికాలంగా మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను పవర్‌ఫుల్ విలన్ పాత్రలతో మొదలుపెట్టారు. ‘భైరవం’ మరియు ‘మిరాయ్’ వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టులో కూడా మనోజ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఈ సినిమాలో కూడా మనోజ్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.
కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా
ఇలా ఒకవైపు యాక్షన్ పాత్రలతో దూసుకుపోతున్న మనోజ్ మళ్ళీ తన ఫేవరెట్ కామెడీ జోనర్‌లోకి అడుగుపెడుతున్నట్లు ‘వడ్డీకాసులవాడ’తో స్పష్టం చేశాడు.ఇక ఈ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోని ఏఐ సహాయంతో రూపొందించడం విశేషం. ఈ వీడియోలో మనోజ్ ఒక మధ్యతరగతి వ్యక్తిగా, ఈఎంఐలు మరియు వడ్డీల భారం మోస్తూ అల్లాడిపోయే పాత్రలో కనిపిస్తున్నారు. తన విలక్షణమైన శైలిలో మనోజ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, “అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 శాతం డిస్కౌంట్ ఇస్తా” అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ బట్టి చూస్తే మంచు ఫ్యామిలీకి, వారి విద్యాసంస్థలకి మరియు రియల్ లైఫ్ లో ఉన్న పరిస్థితులకు కనెక్షన్ ఉన్నట్టు అర్థమవుతుంది.
తేజ్ ఉప్పాలపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మంచు మనోజ్ స్వయంగా తన నిర్మాణ సంస్థపై, అగ్ర నిర్మాత అనిల్ సుంకరతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.ఇక కామెడీకి పెద్దపీట వేస్తూ తెరకెక్కబోయే ఈ చిత్రం, మధ్యతరగతి కుటుంబాల బాధలని మరియు అప్పుల సమస్యలను ఫన్నీగా చూపిస్తూనే ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించనుందని తెలుస్తుంది.ఇక గతంలో మనోజ్ చేసిన ‘బిందాస్’, ‘ఝుమ్మంది నాదం’ వంటి సినిమాలలోని కామెడీ టైమింగ్ ఈ మూవీలో చూడవచ్చని ఆశిస్తున్నారు మంచు ఫ్యాన్స్
రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే
ప్రస్తుతం ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా, మంచు మనోజ్ తన కామెడీ టచ్‌ను వదల్లేదు. బాలయ్య సినిమాలో నెగిటివ్ షేడ్స్, అదే సమయంలో ‘వడ్డీకాసులవాడ’తో పక్కా ఫన్ జానర్ ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు ప్లస్ అయ్యేలానే కనిపిస్తుంది.చూడాలి మరి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో అప్పుల బాధల నుండి మనోజ్ ఎలా బయటపడ్డాడు ? మధ్యలో ఈ వడ్డీకాసులవాడ కథేంటి? అనేది తెలుసుకోవాలంటే రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే!
also read :‘ఒక్కసారి చేస్తే క్షమించేయొచ్చు’.. చీటింగ్‌పై రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ కామెంట్స్ వైరల్