E-Paper
Advertisement

జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి!

జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి!
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని ఒకే కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

జగిత్యాల పట్టణంలో నివాసమంటున్న భారతి, భూషణం దంపతుల పిల్లలు మనవిత్ (10) , మనస్విని (9). ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వీరు కొండాపూర్‌లోని తమ చిన్నమ్మ ఇంటికి సరదాగా వెళ్లారు. అక్కడ చిన్నమ్మ కొడుకు షర్వింద్ (7) తో కలిసి ఆడుకుంటూ, స్నానం చేయడం కోసం స్థానిక కోనేరు వద్దకు వెళ్లారు.

Advertisement

అయితే, నీటి లోతును అంచనా వేయలేక ముగ్గురు చిన్నారులూ కోనేరులో మునిగిపోయారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికీ జరగరాని నష్టం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు కళ్ల ముందే నిర్జీవంగా మారడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చిన పిల్లలు ఇలా అనంత లోకాలను వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: ట్విస్ట్ అదిరింది.. ఆలూ చిప్స్, వాటర్ బాటిల్స్ అనుకుంటే షాకే.. లోపల రూ.3 కోట్ల గంజాయి!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×