E-Paper
Advertisement

‘ఒక్కసారి చేస్తే క్షమించేయొచ్చు’.. చీటింగ్‌పై రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ కామెంట్స్ వైరల్

‘ఒక్కసారి చేస్తే క్షమించేయొచ్చు’.. చీటింగ్‌పై రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ కామెంట్స్ వైరల్
Advertisement

Rakul Comments : ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్‌…వీటి గురించి డిస్కషన్ వస్తే చాలు సోషల్ మీడియాలో అదో పెద్ద సెన్సేషన్.ఎందుకంటే ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందో తెలీదు కాబట్టి.ఇక లేటెస్ట్ గా ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజీ స్టార్,వెటరన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్. తన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’ ప్రమోషన్స్‌లో భాగంగా, రిలేషన్‌షిప్‌లో ‘చీటింగ్’ అనే సెన్సిటివ్ ఇష్యూ పై రకుల్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతూ, పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది కూడా.

ఒకసారి క్షమించడం తప్పేం కాదు

Advertisement

ఇక ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ సారా అలీ ఖాన్‌లతో కలిసి ప్రమోషన్స్‌ కోసం ఒక ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు, “రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా?” అన్న ప్రశ్న ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ప్రశ్నలకు చాలా సేఫ్‌గా సమాధానం ఇస్తుంటారు, కానీ రకుల్ మాత్రం చాలా ఓపెన్‌గా మాట్లాడటం గమనార్హం.”ఏదైనా తెలియక ఒకసారి పొరపాటు చేసి, దానికి మనస్పూర్తిగా బాధపడుతూ నిజాయితీగా క్షమాపణ కోరితే, ఒకసారి క్షమించడం తప్పేం కాదు” అంటూ మనసులోని మాటలని బయటపెట్టింది రకుల్.అయితే ఈ మాటలు తన పర్సనల్ లైఫ్ లేదా తన భర్తకు వర్తించవని, కేవలం ఒక జనరల్ ఒపినియన్ మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చేసింది.

also read :జస్ట్ ‘నో’ చెప్పడమే పాపమా.. సింగర్ హత్య వెనుక బయటపడుతున్న భయంకర నిజాలు!

Advertisement

రిలేషన్‌షిప్‌లో అబద్ధాలు చెప్పకూడదు 

ఇక ఇదే ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయుష్మాన్ ఖురానా కూడా రియాక్ట్ అవుతూపెళ్లి తర్వాత రిలేషన్ షిప్స్‌లో కొన్ని నియమాలు ఉంటాయని, మనిషన్నాక పొరపాట్లు జరగడం సహజమని, అయితే అవే పనిగా మారిపోకూడదని స్పష్టం చేశాడు. మరోవైపు సారా అలీ ఖాన్ స్పందిస్తూ, రిలేషన్ లో ఉన్నప్పుడు మోసం చేయడం సరికాదని,రిలేషన్‌షిప్‌లో అబద్ధాలు చెప్పకూడదంటూ కుండబద్దలు కొట్టింది. అయితే, “అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా?” అని సారా అడిగిన ప్రశ్నకు రకుల్ మొదట “కుదరదు” అని చెప్పినా, వెంటనే తన అభిప్రాయాన్ని మరింత క్లారిటీగా వివరించింది. “జీవితం చాలా పెద్దది. కేవలం ఒక్క పొరపాటు చేసినందుకు అవతలి వ్యక్తిని జీవితాంతం క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు” అని రకుల్ తేల్చి చెప్పింది.

ఈ కామెంట్స్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో

ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో ఫుల్ డిబెటబుల్ అయ్యాయి. కొందరు రకుల్ మెచ్యూర్డ్ గా థింక్ చేస్తుందంటే మరికొంత మంది ఇలాంటి విషయాల్లో అస్సలు క్షమించాల్సిన అవసరం లేదంటూ ఆర్గ్యు చేస్తున్నారు.అయితే రకుల్ చెప్పినట్లు మనిషి సహజమైన పొరపాట్లను క్షమించడం గొప్పతనమా, లేక రిలేషన్‌షిప్స్‌లో బలహీనతను చూపిస్తుందా అనేది వారి వారి అభిప్రాయాల ఆధారపడి ఉంటుంది.మొత్తానికి ‘పతీ పత్నీ ఔర్ వో దో’ సినిమా సక్సెస్‌తో పాటు, ఈ హీరోయిన్ చేసిన బోల్డ్ కామెంట్స్ కూడా సినిమాకు భారీ పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయన్న మాట . ఇక సినిమా థియేటర్లలో ఎలా విజయవంతంగా నడుస్తుండటంతో, ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో మరింత వేగంగా షేర్ అవుతున్నాయి. చూడాలి ముందు ముందు రకుల్ భామ వదిలిన ఈ కామెంట్స్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో !

also read :వీడియో వైరల్.. కదులుతున్న రైలులో ఊహించని దృశ్యం.. తోటి ప్రయాణికులు షాక్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×