Manchu Vishnu: తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడితే కొన్ని రోజులు సరిపోవు. ఎంతోమంది మహానటులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది మహానటులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేకపోయినా కూడా వాళ్ళు కళామ్మతల్లికి అందించిన సేవలు, వాళ్ల పర్ఫామెన్స్ ఎప్పటికీ కూడా చిరస్మరణీయం.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడు మోహన్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో అతని సినిమాలు ట్రోల్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు అతనికి కలెక్షన్ కింగ్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ కూడా కొంతమంది మోహన్ బాబును కలెక్షన్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. మోహన్ బాబు చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేశాయి.
ఒక తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కలెక్షన్స్ కూడా మోహన్ బాబు సినిమా బీట్ చేసింది. అప్పటి నుంచే మోహన్ బాబుని కలెక్షన్ కింగ్ అని ఎవరు అనడం మొదలుపెట్టారు అది ఆనవాయితీగా వచ్చేసింది అనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి.
మోహన్ బాబు తనయులు, మరియు కూతురు మంచు లక్ష్మి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లు కూడా నటులుగా తమ ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలి అని ఉద్దేశంతోనే ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కెరియర్ లో కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి.
మంచు మోహన్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మంచు విష్ణు. 94 సంవత్సరాల సినిమా చరిత్రలో మా ఫాదర్ 50 సంవత్సరాలు ఉన్నరు. నేను దానిని ఎప్పటికీ కూడా గర్వంగా ఫీల్ అవుతాను. అతనికి ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. లెజెండరీగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ నాన్న అంటూ మెసేజ్ చేశారు.
In 94 years of Telugu cinema, my father has carried 50 of them on his shoulders. Grateful, humbled, and forever proud to witness his extraordinary journey. Congratulations on 50 legendary years, Nana. 🤍 #MB50 pic.twitter.com/SlComqH0TW
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2025
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు. మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆ సినిమా నుంచి విడుదలైంది. అయితే ఆ సినిమాతో పవర్ఫుల్ విలన్ ను మళ్లీ చూడబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు శ్రీకాంత్.
ఇకపోతే మోహన్ బాబు మొదట విలన్ గానే మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాలంలో హీరోగా మారిపోయారు. ఇప్పుడు మళ్లీ విలన్ గా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారో చూడాలి. అయితే మోహన్ బాబు ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు.
Also Read: Actress Hema : మీరు చేసిన దుష్ప్రచారం వల్లే మా అమ్మ చనిపోయింది, నటి హేమ ఎమోషనల్