E-Paper
Advertisement

Actress Hema : మీరు చేసిన దుష్ప్రచారం వల్లే మా అమ్మ చనిపోయింది, నటి హేమ ఎమోషనల్

Actress Hema : మీరు చేసిన దుష్ప్రచారం వల్లే మా అమ్మ చనిపోయింది, నటి హేమ ఎమోషనల్
Advertisement

Actress Hema : నటి హేమ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు హేమ. కొన్ని విషయాల్లో హేమ మాట్లాడని విధానం చాలా గట్టిగా ఉంటుంది. చాలామంది దర్శకుల గురించి కూడా హేమా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు.

హేమ పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు గురించి మాట్లాడిన విధానం కూడా వైరల్ అయింది. అయితే ఒక రేవు పార్టీలో హేమ దొరికినట్లు అప్పట్లో మీడియాలు కథనాలు వినిపించాయి. అప్పట్లో ఆ న్యూస్ ఒక సంచలనం గా మారింది. అది కోర్టు వరకు వెళ్ళింది. ఈ కోర్టులో తుది నిర్ణయం వచ్చేసింది. ఈ సందర్భంగా నటి హేమ ఒక ఎమోషనల్ వీడియో విడుదల చేశారు.

నేను నిర్దోషిని

Advertisement

నేను నిర్దోషి నని కోర్టు నాపై ఉన్న కేసు కొట్టేసింది.బెంగళూరు హైకోర్టు వారు నామీద ఉన్న కేసును క్వాష్ చేశారు కేసు కొట్టేశారు.నవంబర్ 3 న జడ్జిమెంట్ వచ్చింది అయితే ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చింది. అందుకే ఇపుడు నేను ఎనౌన్స్ చేస్తున్నాను.సోషల్ మీడియాలో నా పై తెగ దుష్ప్రచారం చేశారు.ఆ బాధతో మా అమ్మ చనిపోయింది.

సోషల్ మీడియాలో నా పై జరిగిన దుర్మార్గపు ప్రచారానికి.సంవత్సరం నర్ర గా నేను నరక యాతన అనుభవిస్తున్నాను. నేను కాదు అని చెప్పినా కుడా కొందరు అసత్య ప్రచారాలు చేశారు. ఎట్టకేలకు నేను నిర్దోషినని కోర్టు తీర్పు ఇచ్చింది.

మా అమ్మ వల్లే ఇక్కడున్నాను

Advertisement

మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. చాలా సందర్భాలలో చాలా ఇంటర్వ్యూలో మా అమ్మ గురించి చెప్పాను. అయితే నా గురించి దుష్ప్రచారం జరిగినప్పుడు కూడా అలా రాయకండి అని ముత్తుకున్నాను ఎవరూ వినలేదు. ఒక రకంగా మా అమ్మ ఆ బాధ వల్లనే ఆరోగ్యం క్షీణించింది. నేను అప్పటికే మా అమ్మకు బాలేదు అని చెబుతూనే ఉన్నాను అంటూ చాలా బాధపడింది నటి హేమ.

ఈ కేసు లో తను నిర్దోషి అనే విషయం నవంబర్ 3వ తారీఖునే తెలిసింది. అయితే అధికారికంగా పేపర్స్ వచ్చేంతవరకు ఎవరికీ చెప్పకూడదు కాబట్టి ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు హేమ. మొత్తానికి ఆమె ఎంతగానో ప్రేమించిన వాళ్ళ మదర్ కి మాత్రం ఈ విషయాన్ని షేర్ చేశారు. ఆమె కొన్ని రోజుల క్రితమే కాలం చేశారు. మొత్తానికి హేమ ఆ కేసులో లేరు అనే క్లారిటీ వచ్చేసింది. ఇకపై ఇప్పుడు లోకం తీరు ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Ram Pothineni: టాప్ ప్రొడక్షన్ హౌస్ లో రామ్ పోతినేని, దర్శకుడు అతడైతేనే సినిమా చేస్తా అంటూ కండిషన్స్

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×