E-Paper
Advertisement

సినీ హీరోలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్.. 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి!

సినీ హీరోలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్.. 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి!
Advertisement

Anirudh Reddy Drugs Test Challenge: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జన్యం అనిరుధ్ రెడ్డి సినీ పరిశ్రమ, డ్రగ్స్ అలవాట్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవిల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నటీనటుల పైనే ఉందని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో సెలబ్రిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వారు తమ బాధ్యతను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ నటీనటులు తప్పనిసరిగా ఫాలికల్ హెయిర్ టెస్ట్ చేయించుకోవాలని అనిరుధ్ రెడ్డి ప్రతిపాదించారు. యూరిన్ టెస్ట్ చేస్తే కేవలం 14-15 రోజుల డేటా మాత్రమే వస్తుందని, కానీ హెయిర్ టెస్ట్ ద్వారా మూడు నెలల హిస్టరీ తెలుస్తుందన్నారు. “నేను ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికే టెస్ట్ చేయించుకున్నాను. నా రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. నా జడ్చర్ల ప్రజలకు నేను ఎలాంటి అలవాట్లు లేని వ్యక్తినని నిరూపించుకున్నాను. అలాగే నటులు కూడా తాము డ్రగ్స్ అడిక్ట్స్ కాదని రిపోర్ట్స్ చూపించాలి. అలా చూపించని పక్షంలో వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్లే భావించాల్సి ఉంటుంది.” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

నటులకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుందని, వారు ఏది చేసినా యువత అనుకరిస్తుందని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. “పవన్ కళ్యాణ్ సిక్స్ పాకెట్ ప్యాంట్ వేస్తే ఫ్యాన్స్ అదే కొంటారు, చిరంజీవి స్టెప్ వేస్తే అందరూ నేర్చుకుంటారు. అంతటి ఆదర్శంగా ఉన్న మీరు, డ్రగ్స్ కు దూరంగా ఉన్నామని రిపోర్ట్స్ ద్వారా నిరూపిస్తే.. మీ ఫ్యాన్స్ కూడా డ్రగ్స్ జోలికి వెళ్లరు” అని ఆయన హితవు పలికారు. రాజకీయ నాయకులు ఏది చెప్పినా విమర్శలుగా చూస్తారని, కానీ హీరోలు చెబితే ప్రజలు వింటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి 90 రోజులకు టెస్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తేనే సినిమాలను రిలీజ్ చేయాలనే కఠిన నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాజకీయ నాయకులను తక్కువ చేసి చూపడంపై అనిరుధ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. “ఒక ఎమ్మెల్యేగా నేను సారా అంటే అందరూ ట్రోల్ చేస్తారు. కానీ హీరోలు సినిమాల్లో గ్లాసులు పట్టుకుని మద్యం తాగుతుంటే గ్రేట్ అంటారా?” అని ప్రశ్నించారు. పాత సినిమాలైన ఖుషి వంటి వాటిలో ప్యాకెట్ల సారాను (గుడంబా) చూపించారని, అది దూల్పేట వంటి ప్రాంతాలను తక్కువ చేసి చూపించడమేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వంటి వారు తెరపై మద్యం తాగుతుంటే, అది చూసి యువత కూడా ఆ అలవాట్ల వైపు ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం సమాజ హితం కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Read Also: హైడ్రా దెబ్బకు హడలెత్తుతున్న రియల్ మాఫియా.. ఒకే రోజు మూడు జిల్లాల్లో..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×