E-Paper
Advertisement

పాపం అల్లరి నరేష్ హీరోయిన్‌కి ఎంత కష్టం వచ్చింది.. తన కుక్కను చంపేశారంటూ..

పాపం అల్లరి నరేష్ హీరోయిన్‌కి ఎంత కష్టం వచ్చింది.. తన కుక్కను చంపేశారంటూ..
Advertisement

Mikey Dog Incident: తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి మంజరి ఫడ్నిస్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో తీవ్ర కలకలం రేగింది. గత ఆరేళ్లుగా తమతో ఎంతో సాధువుగా ఉంటున్న ‘మైకీ’ అనే కమ్యూనిటీ డాగ్‌ను కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి, చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని చెప్తూ నటి మంజరి సోషల్ మీడియాలో కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జంతు ప్రేమికులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ ఘాతుకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also-రూ. 300 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’!.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

అసలేం జరిగింది?

Advertisement

మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఒక కుటుంబం వదిలేసి వెళ్లిన లాంగ్ హెయిర్ డాగ్‌ను ఆమె నివసిస్తున్న సొసైటీ సభ్యులు చేరదీశారు. దానికి ‘మైకీ’ అని పేరు పెట్టి సొసైటీలోనే పెంచుకుంటున్నారు. మంజరి కూడా దానికి స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం లాంటివి చేసేవారు. అయితే కొన్ని రోజుల క్రితం మైకీ హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దాంతో ఆందోళన చెందిన మంజరి, చుట్టుపక్కల వాళ్లు ఎంత వెతికినా ఆనవాళ్లు దొరకలేదు.

కానీ, సొసైటీలో పనిచేసే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. సొసైటీ బేస్‌మెంట్ ఏరియాలో మైకీ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో, కొందరు వ్యక్తులు పక్కా ప్లాన్‌తో వచ్చి దాని తలపై పెద్ద కర్ర లేదా ఇనుప రాడ్‌తో బలంగా కొట్టారు. ఆ దెబ్బకు అది స్పృహ తప్పి అల్లాడుతుంటే, బేస్‌మెంట్ నుంచి లాబీ ఏరియా మెట్ల వైపు ఈడ్చుకెళ్లారు. అక్కడ కూడా దానిని దారుణంగా బాదారు. దాంతో దానికి నోటి నుంచి రక్తం కారి, భయంతో అక్కడే మలమూత్ర విసర్జన చేసింది. అలా సగం ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ మూగజీవాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, సొసైటీ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.

Advertisement

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..

ఏడ్చేస్తూ వీడియో షేర్ చేసిన మంజరి

ఈ ఘోరం గురించి ఇన్స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన మంజరి ఫడ్నిస్ తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. “మైకీ ఎంతో అమాయకమైనది. ఎవరికీ ఏ హానీ చేయలేదు. అలాంటి మూగజీవాన్ని ఇంత దారుణంగా చంపడానికి మనసెలా ఒప్పింది? ఆ మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. జంతువులను హింసించే వారిపై మన చట్టాలు మరింత కఠినంగా మారాలి” అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ప్రస్తుతం మైకీ శరీరం కోసం వెతుకుతున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నటీమణులు భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి సహా వేలాది మంది నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద దోషులను కఠినంగా శిక్షించాలంటూ మంజరికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మంజరి ఫడ్నిస్ తెలుగులో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం, జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ఆమె కుక్కను చంపిన వారిపై ఖటిన చర్యలు తీసుకోవాలపని డిమాండ్ చేస్తున్నారు.

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×