E-Paper
Advertisement

Prabhas: రాజా సాబ్ సినిమా నుండి పెద్ద ట్విస్ట్ రివీల్ చేసేసిన మారుతి.. షాక్ లో ఫ్యాన్స్..

Prabhas: రాజా సాబ్ సినిమా నుండి పెద్ద ట్విస్ట్ రివీల్ చేసేసిన మారుతి.. షాక్ లో ఫ్యాన్స్..
Advertisement

Raja Saab Trailer:  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న తాజా సినిమా “ది రాజా సాబ్”. ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. సంక్రాంతి సీజన్ కూడా కావడంతో సినిమాపై భారీ హైప్ ఉంది. ఇది ఒక హారర్ కామెడీ యాక్షన్ ఫాంటసీ సినిమా. దర్శకుడు మారుతి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మారుతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కామెడీ టైమింగ్‌కి మంచి పేరున్న డైరెక్టర్. పైగా ప్రభాస్‌తో సినిమా కాబట్టి అంచనాలు ఇంకా పెరిగాయి.

రాజా సాబ్ ట్విస్ట్ బయట పెట్టేశారుగా..

ఈ సినిమాలో ప్రభాస్ కొత్తగా కనిపించబోతున్నాడని టీజర్, ట్రైలర్ చూసినవాళ్లందరికీ అర్థమైంది. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించిన జోకర్ లుక్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే తాజాగా మారుతి ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ జోకర్ లుక్ అసలు ఈ పార్ట్‌లో సీన్ కాదని, అది పార్ట్ 2కి లీడ్ మాత్రమే అని చెప్పడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశపడ్డారు.

Advertisement

ఇంకా మరో విషయం కూడా చర్చకు వచ్చింది. సీనియర్ నటి జరీనా వాహబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర చాలా బాగా హైలెట్ అయ్యేలా ఉంటుందట. కానీ ఆమెకు ఒక డీప్ బ్యాక్‌స్టోరీ ఉందని, ఆ లుక్ ఇప్పటికే ట్రైలర్‌లో రివీల్ అయిపోయిందని మారుతి చెప్పేశారు. ఇలాంటి విషయాలు ముందే చెప్పడం వల్ల సస్పెన్స్ తగ్గిపోతుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ మొత్తం పరిస్థితి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మారుతి గారు వరుస ఇంటర్వ్యూలు, ఫైనల్ కాపీ ప్రెజర్ వల్ల బాగా స్ట్రెస్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ ఎంత స్ట్రెస్ లో ఉన్నా కూడా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సినిమా గురించి ఇలా మేజర్ ట్విస్ట్ బయట పెట్టేస్తే అది సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.

రాజా సాబ్ సినిమాలో హైలెట్స్ ఇవే..

Advertisement

నిజానికి ది రాజా సాబ్ సినిమాకు మూడు పెద్ద ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు కొత్త ఎనర్జీ ఇస్తాయి. రెండోది థమన్ సంగీతం. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టీజర్ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడోది సంక్రాంతి రిలీజ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎక్కువగా వచ్చే టైమ్.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా మాళవిక మోహనన్‌కు ఇది తెలుగు డెబ్యూ సినిమా. అలాగే సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తాడనే టాక్ ఉంది.
మొత్తానికి, డైరెక్టర్ మాటల వల్ల నెగటివ్ టాక్ వచ్చినా, సినిమా మీద హైప్ మాత్రం తగ్గలేదు. జనవరి 9న థియేటర్‌లో సినిమా ఎలా ఉంటుందో అన్నది అసలు టెస్ట్.

ALSO READ: Prabhas: స్టార్ హీరోలకు భిన్నంగా ప్రభాస్ వెళ్లడానికి కారణం ఏమిటో తెలుసా..?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×