E-Paper
Advertisement

Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీష్ రావులే.. రేవంత్ కాదు: ఎంపీ చామల ఫైర్

Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీష్ రావులే.. రేవంత్ కాదు: ఎంపీ చామల ఫైర్
Advertisement

Chamala Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చనిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ కోరుకోరని, ఒకవేళ కేసీఆర్ అడ్డు తొలగాలని ఎవరైనా భావిస్తే అది కేవలం ఆయన కుటుంబంలోని కేటీఆర్, హరీష్ రావులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటు కోసం కేటీఆర్, పార్టీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి హరీష్ రావు తహతహలాడుతున్నారని, వీరి అధికార దాహానికి అడ్డు వస్తుందనే కవితను కూడా బయటకు పంపించారని ఆరోపించారు.

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత పదేళ్లుగా జరిగిన దోపిడీని, కమిషన్ల కక్కుర్తిని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో బావ, బామ్మర్దులకు మింగుడుపడటం లేదని ఎద్దేవా చేశారు. దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించిన సంస్కారం రేవంత్‌దని, ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి రావాలని కోరారని గుర్తుచేశారు.

Advertisement

కేసీఆర్ రావణుడిలా పాలించడం వల్లే ప్రజలు రేవంత్‌ను సీఎంగా ఎన్నుకున్నారని, ఒకవేళ కేసీఆర్ మంచి పాలన అందించి ఉంటే ఆయనే అధికారంలో ఉండేవారని చామల విశ్లేషించారు. కేసీఆర్ బతికి ఉంటేనే గత పదేళ్ల పాపాలు బయటపడతాయని, అందుకే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. తెలంగాణ యాసలో రేవంత్ మాట్లాడే మాటలను వక్రీకరిస్తూ.. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో మాయ చేయడం హరీష్, కేటీఆర్‌లకు అలవాటుగా మారిందని, ప్రజలు ఈ వాస్తవాలను గమనించాలని ఎంపీ కోరారు.

Read Also:  సభ నుంచి పారిపోతారా? ఇది ముమ్మాటికీ తప్పే: BRSపై కవిత సంచలన వ్యాఖ్యలు!

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×