E-Paper
Advertisement

Director Maruthi: కాలర్ ఎగరేస్తారని చెప్పను కానీ.. మారుతి సెటైర్స్ ఎన్టీఆర్ వార్ 2 పైనేనా?

Director Maruthi: కాలర్ ఎగరేస్తారని చెప్పను కానీ.. మారుతి సెటైర్స్ ఎన్టీఆర్ వార్ 2 పైనేనా?
Advertisement

Director Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మారుతి(Maruthi) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. మారుతి దర్శకత్వంలో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 9, 2026 లో విడుదల కాబోతుందని చిత్రబంధం అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని సంక్రాంతి పండుగకు తప్పకుండా రాజా సాబ్ వస్తాడంటూ క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతి పండుగకే రాజా సాబ్..

ఇకపోతే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి కూడా ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెబుతూనే పరోక్షంగా ఎన్టీఆర్ పై సెటైర్లు వేసారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మారుతి ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడుతూ..

ఈ కటౌట్ ముందు అవి చిన్న మాటలు..

Advertisement

ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి పండుగకు మీ ముందుకు రాబోతుందని తెలిపారు. ఈ సినిమా విషయంలో అందరికీ నేను చాలా కచ్చితంగా చెబుతున్నాను.. రేపు పండగకి మీరంతా కాలర్ (Collar)ఎగరేసుకుంటారు అని చెప్పను కానీ, ఇలాంటి మాటలని ఈ కటౌట్ ముందు చాలా చిన్న మాటలు అంటూ ప్రభాస్ గురించి గొప్ప ఎలివేషన్ ఇస్తూ ఈయన మాట్లాడారు. ఇలా కాలర్ ఎగరేసుకోవడం వంటి మాటలు ప్రభాస్ సినిమాకు చాలా చిన్న మాటలంటూ ఈయన మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారుతి ఈ వ్యాఖ్యలను సందర్భానుసారంగా మాట్లాడే తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం అవుతున్నప్పటికీ ఈ వ్యాఖ్యలపై పై విమర్శలు వస్తున్నాయి.

ఉద్దేశ పూర్వకంగా అనలేదు…

Advertisement

మారుతి ఎన్టీఆర్ (NTR)సినిమాని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా ఈవెంట్లో భాగంగా ఈ సినిమా చూసి ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేస్తారు అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అలాంటి మాటలు మన సినిమాకు చాలా తక్కువ అంటూ మారుతి ఎన్టీఆర్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ మాట్లాడారని చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు.ఇకపోతే ప్రభాస్ అభిమానులు మాత్రం డైరెక్టర్ మారుతి వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Keerthy Suresh:  మహానటితో నేషనల్ అవార్డు… అవకాశాలే లేవన్న కీర్తి సురేష్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×