Pakistan: పాకిస్థాన్‌లో ముష్కరులు తెగబడ్డారు. పెషావర్‌లోని ఆదేశ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఈ ఉదయం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు అక్కడి పోలీసు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రిరిస్టులు-పాక్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దళాలు ఉండొచ్చని అంటున్నారు.
కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్
సోమవారం ఉదయం పెషావర్‌లోని పాకిస్తాన్ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి చేశారు. ఆ ఆఫీసును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని స్థానిక పోలీసులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. మొదటి ఆత్మాహుతి దాడి కాన్స్టాబులరీ ప్రధాన ద్వారంపై జరిగింది.
ఆ దాడి తర్వాత మరొకరు ఆవరణలోకి ప్రవేశించినట్టు ఓ సీనియర్ అధికారిని తెలిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం, స్థానికులు పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అప్పటికే కొందరు ఉగ్రవాదులు ప్రధాన కార్యాలయం లోపల వెళ్లినట్టు అనుమాని స్తున్నారు. ప్రాథమిక నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. రెండు పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.
పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి
ఒకటి ప్రధాన గేటు వద్ద కాగా, మరొకటి సమీపంలోని మోటార్ సైకిల్ స్టాండ్ వద్ద ఐఈడీ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో నలుగురు గాయపడ్డారు. వారిని త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన సంఘటనగా పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో క్వెట్టాలోని పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల కారు బాంబు పేలింది. ఈ ఘటనలో కనీసం పది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
ALSO READ: బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్
సెప్టెంబర్ 3న క్వెట్టాలో ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది. అందులో 11 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్తాన్‌లో చాలా కాలంగా అక్కడి తిరుగుబాటుదారులతో పాకిస్తాన్ దళాలు పోరాడుతున్నాయి. గతేడాది 782 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఓ రైలుని హైజాక్ చేసి సైనికులను హతమార్చింది. జనవరి నుండి వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 430 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించినట్టు అక్కడి నివేదికలు చెబుతున్నాయి.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు..!
పాకిస్థాన్-ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ వద్ద ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు
రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దం.. కొనసాగుతున్న కాల్పులు
పాకిస్థాన్ దళాలపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగే అవకాశం pic.twitter.com/FCU1ZYt5Dq
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2025