E-Paper
Advertisement

The Raja Saab Movie : మారుతికి అలాంటి అలవాటు.. అందుకే రాజా సాబ్ ఆలస్యం

The Raja Saab Movie : మారుతికి అలాంటి అలవాటు.. అందుకే రాజా సాబ్ ఆలస్యం
Advertisement

The Raja Saab Movie : మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటే అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. మారుతికి ప్రభస్ అలా ఎలా అవకాశం ఇచ్చాడు అంటూ తెగ ఆలోచించారు. మారుతి మాత్రం వచ్చిన ఛాన్స్‌ను కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలని అనుకున్నాడు. హర్రర్ కామెడీ జానర్‌లో స్ట్రాంగ్ స్టోరీని రెడీ చేసుకున్నాడు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు ఆ మూవీ మేకర్స్. ఇదిలా ఉంటే.. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా.. ఆలస్యం అవ్వడానికి కారణం మారుతే అని తెలుస్తుంది. అది ఏంటో ఇక్కడ చూద్దాం.

ప్రభాస్ సినిమా అంటే డైరెక్టర్‌పై ఎంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే, ప్రభాస్ సినిమా అంటే అభిమానులు చాలా హోప్స్ పెట్టుకుంటారు. అందులో ఎక్కడ లోపం జరిగినా.. డైరెక్టర్‌ అభిమానులకు టార్గెట్ అవ్వడం ఖాయం. ఇప్పుడు అవే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్ మారుతి.

Advertisement

వీరి ఇద్దరి కాంబినేషన్‌లో ది రాజా సాబ్ మూవీ వస్తుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ, వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అనుకున్నారు. కానీ, ఆ డేట్ నుంచి తప్పుకుని ఫైనల్ అంటూ సంక్రాంతి బరిలో నిలిచారు.

మారుతి వల్లే ఆలస్యం?

అయితే, ఇలా ఆలస్యం అవ్వడానికి కారణం డైరెక్టర్ మారుతి… ఆయన నమ్మకాలు అని తెలుస్తుంది. మారుతి న్యూమరాలజీని బాగా నమ్ముతాడు. సినిమా టైటిల్స్.. దాని న్యూమరాలజీ ప్రకారం ఉండే నెంబర్… టైటిల్ ఏ కోణంలో ఉండాలి అంటూ ప్రతిదానికి కొలతలు పెట్టుకుంటాడంట.

క్రాస్ టైటిల్స్ సెంటిమెంట్..

Advertisement

ఇప్పటి వరకు మారుతి డైరెక్షన్‌లో వచ్చే సినిమాల టైటిల్స్ అన్నీ కూడా క్రాస్‌లోనే ఉంటాయి. బేబీ అనే సినిమాకు మారుతి వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. ఆ సినిమా టైటిల్ కూడా క్రాస్‌లోనే ఉంటుంది. కానీ, ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్.. స్టార్ కాస్ట్ అండ్ క్రూ చేస్తున్న ది రాజా సాబ్ సినిమా టైటిల్‌ను మాత్రం.. తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టి రెడీ చేశాడు.

డిజైనర్ కమ్ డైరెక్టర్..

ఇక్కడ ఎవ్వరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే… మారుతి సినిమా ఇండస్ట్రీకి రాకముందు .. తన స్వస్థలం అయిన మచిలీపట్నంలో రేడియం డిజైనర్‌గా పని చేశాడు. ఆ అనుభవంతోనే.. తాను డైరెక్షన్ చేసే సినిమా టైటిల్స్‌ను తానే డిజైన్ చేసుకుంటాడు.

అంతే కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం పార్టీ జెండాను కూడా మారుతినే డిజైన్ చేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియదు.

ఇదింతా పక్కన పెడితే.. ఈ న్యూమరాలజీ లెక్కలను ఈ సారి డైరెక్టర్ మారుతి పక్కన పెట్టాడంట. అందుకే తాను ఎప్పుడూ డిజైన్ చేసి క్రాస్ టైటిల్ విధానాన్ని కూడా కాదని… ది రాజా సాబ్ టైటిల్‌ను తయారుచేశారంట.

ఇలా తన సెంటిమెంట్‌ను పక్కన పెట్టడం వల్లే… ది రాజా సాబ్ ఆలస్యమవుతుందని కొంత మంది అంటున్నారు. ఆయన ఎప్పటిలానే.. న్యూమరాలజీ లెక్కలన్నీ వేసుకుని, ఆ క్రాస్ సెంటిమెంట్‌ను ఫాలో అయితే.. సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేదని, మంచి ఫలితం వచ్చేదని అంటున్నారు.

ఇప్పుడు తన న్యూమరాలజీ లెక్కలు… తన క్రాస్ టైటిల్ సెంటిమెంట్ పక్కన పెట్టి.. ఈ భారీ మూవీని సంక్రాంతి బరిలో నిలిపాడు. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో… మారుతికి డైరెక్టర్‌గా ఎలాంటి పేరు తెప్పిస్తుందో చూడాలి మరి.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×