E-Paper
Advertisement

Tirumala Laddu Adulterated Case: తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం, మరో ఇద్దరు?

Tirumala Laddu Adulterated Case: తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం, మరో ఇద్దరు?

Tirumala Laddu Adulterated Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులను మాత్రమే అరెస్ట్ చేసింది సీబీఐ. ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల వంతైంది. గతంలో చక్రం తిప్పినవారిపై ఫోకస్ చేసింది. సరుకుల కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసింది. దీంతో మరిన్ని అరెస్టు జరుగుతాయని అంటున్నారు. వచ్చేవారంలోపు మరో ఇద్దరు అరెస్టు కావచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.

తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులను మాత్రమే అరెస్టు చేసింది. తాజాగా గురువారం టీటీడీలో సరుకులు కొనుగోలు విభాగంలో జీఎం సుబ్రహ్మణ్యంని అరెస్టు చేసింది సీబీఐ. టీటీడీలో ఇదే తొలి అరెస్టు. దీంతో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ వారం లేకుంటే వచ్చేవారంలో మరికొందరు టీటీడీ ఉద్యోగులు, గతంలో పని చేసినవారు అరెస్టు కావచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  అప్పుడు టీటీడీలో కీలకంగా వ్యవహరించినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఈ కేసులో ఎవరికివారు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు మాత్రం, పైవాళ్లు చెప్పినట్టే చేశామని చెబుతున్నారు. గతంలో కీలకంగా వ్యవహరించినవారు.. మాకేం తెలీదని, అంతా అధికారులు చూసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్టు అయ్యారు. ఆయన గుట్టు విప్పితే చాలామంది అరెస్టు కావడం ఖాయం. సరుకుల కొనుగోళ్ల విషయం లో పైస్థాయి నుంచి సమాచారం లేకుండా ఎలాంటి కొనుగోళ్లు చేయరన్నది కొందరు ఉద్యోగుల మాట. టీటీడీ ఉద్యోగుల అరెస్టు తర్వాత ఆనాడు కీలకంగా వ్యవహరించిన వంతుకానుందని అంటున్నారు.

సుబ్రహ్మణ్యం నోరు విప్పితే చాలామంది

సుబ్రహ్మణ్యం అరెస్టుతో నిందితుల సంఖ్య రెండు డజన్లకు చేరింది. ఆయన్ని కస్టడీని తీసుకుని విచారిస్తే మరింత మంది అదుపులోకి తీసుకోవడం ఖాయమని వాదన లేకపోలేదు. అరెస్టయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతుండగా ఆనాటి టీటీడీ పెద్దలు మీడియా ముందుకు రావడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న చర్చ అప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. లడ్డూ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, అంతా అధికారులు చూసుకున్నారంటూ చెప్పే ప్రయత్నం చేశారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఏదైనా కేసు విచారణ జరిగేటప్పుడు మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇంతకీ వైవీ ఎందుకు మాట్లాడినట్టు అంటూ చర్చించుకుంటున్నారు.

ALSO READ: అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్, సీఎం ఇంట్లో డిన్నర్

గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఏం జరిగింది? వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయంటూ వారం రోజులుగా వార్తలు జోరందుకున్నాయి. దాన్ని డైవర్ట్ చేసేందుకు తొలుత నేషనల్ మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత సమావేశం పెట్టారు. సమావేశం తర్వాత చాలామంది మీడియా మిత్రులు వైవీతో మాట్లాడారు. లడ్డూ వ్యవహారంలో  అధికారులు చూశారని ఎలా చెబుతున్నారని ప్రశ్నిస్తే, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారట. మరో విషయం ఏంటంటే.. వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చిన సమయంలో అమరావతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కార్యక్రమం జరిగింది. దానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.. ప్రసంగించారు కూడా. దాన్ని డైవర్ట్ చేసేందుకు వైవీ మీడియా ముందుకొచ్చారని అంటున్నారు. దీంతో మీడియా అటెన్షన్ అంతా ఢిల్లీ వైపు వెళ్లిందని అంటున్నారు. మొత్తానికి లడ్డూ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీలో టెన్షన్ మొదలైందని అంటున్నారు కొందరు నేతలు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×