E-Paper
Advertisement

RCB: హెడ్, క్లాసెన్ లాంటి రాక్షసులను బెంగుళూరు వదిలేసిందా.. షాకింగ్ లిస్ట్ ఇదే

RCB: హెడ్, క్లాసెన్ లాంటి రాక్షసులను బెంగుళూరు వదిలేసిందా.. షాకింగ్ లిస్ట్ ఇదే
Advertisement

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} లో అత్యంత ఆదరణ కలిగిన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} ఒకటి. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఈ జట్టు ఆడుతోంది. అద్భుతమైన ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. కానీ ఈ జట్టు కప్ సాధించేందుకు చాలా ఏళ్లు కష్టపడింది. ప్రతి సంవత్సరం ఈసారి కప్పు మాదే అంటూ సీజన్ ని ప్రారంభించడం.. చివరకు ఉసూరుమనిపించడం ఈ జట్టుకు గతంలో అలవాటుగా ఉండేది.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

Advertisement

కానీ ఐపీఎల్ 2025 లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ జట్టులో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ ఉండేది కాదు. ప్రతిసారి ట్రోఫీ గెలుస్తుందని అంచనా వేసే జట్లలో ఈ జట్టు ముందు వరసలో ఉన్నా.. ఆ జట్టు తలరాత మాత్రం వేరే విధంగా ఉండేది. ఈ జట్టులో గతంలో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తే ఈ జట్టు ఎప్పుడో కప్పు గెలిచేది. కానీ గతంలో చాలామంది కీలక ఆటగాళ్లని వదిలేస్తూ వచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

హెడ్, క్లాసెన్ లాంటి రాక్షసులను వదిలేసిన ఆర్సిబి:

విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబిడి, ట్రావీస్ హెడ్, క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నప్పుడు కూడా ఆర్సిబి ట్రోఫీని ముద్దాడ లేకపోయిందంటే ఆ జట్టు ఫేట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ జట్టు ప్రతీసారి కప్ కొడుతుందని ఆర్.సీ.బి అభిమానులు ఆశలు పెట్టుకోవడం.. ఈ జట్టు నిరాశపరచడం సర్వసాధారణంగా ఉండేది. గతంలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరిన ఆర్సిబి.. టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. అవి 2009, 2011, 2016 సంవత్సరాలలో ఫైనల్ కీ అర్హత సాధించి.. తుది పోరులో మాత్రం తడబడింది.

Advertisement

 

అయితే ఈ జట్టుకు బ్యాటింగ్ లో తిరుగు లేనప్పటికీ.. సమిష్టిగా రాణించడంలో విఫలమవుతుండేది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 2017 సీజన్ తర్వాత ట్రావీస్ హెడ్ ని రిలీజ్ చేసింది. ఇతడు 2016 సంవత్సరంలో ఆర్సిబి ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత 2017 సీజన్ లో సరిగ్గా రాణించకపోవడంతో అతడిని రిలీజ్ చేసింది. ఆ తర్వాత హెడ్ కొన్ని సీజన్ల పాటు ఐపీఎల్ లో ఆడలేదు. ఇక 2024 ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతడిని కొనుగోలు చేసింది. దీంతో 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున అద్భుతంగా రాణించిన హెడ్.. హైదరాబాద్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. హెన్రిచ్ క్లాసెన్ ని కూడా అర్సిబి 2020 వేలానికి ముందు విడుదల చేసింది. ఇతడు 2019 సీజన్ లో ఆర్సిబి తరఫున ఆడాడు.

IPL 2026 ముందు విడుదలైన ఆటగాళ్లు:

లియామ్ లివింగ్‌స్టోన్.
లుంగీ ఎన్గిడి.
మయాంక్ అగర్వాల్.
మనోజ్ భాండగే.
మోహిత్ రాతీ.
స్వస్తిక్ చిక్కారా.
టిమ్ సీఫెర్ట్.
బ్లెస్సింగ్ ముజారబానీ.

IPL 2025 ముందు విడుదలైన ఆటగాళ్లు:

మహ్మద్ సిరాజ్.
ఫాఫ్ డు ప్లెసిస్.
గ్లెన్ మాక్స్‌వెల్.
మయాంక్ డాగర్.
విజయ్‌కుమార్ వైశాక్.
ఆకాష్ దీప్.
ఇతరులు.

IPL 2024 ముందు విడుదలైన ఆటగాళ్లు:

వనిందు హసరంగ.
హర్షల్ పటేల్.
జోష్ హేజిల్‌వుడ్.
ఫిన్ అలెన్.
మైఖేల్ బ్రేస్‌వెల్.
డేవిడ్ విల్లీ.
వేన్ పార్నెల్.
సోను యాదవ్.
అవినాష్ సింగ్.
సిద్ధార్థ్ కౌల్.
కేదార్ జాదవ్.

IPL 2023 ముందు విడుదలైన ఆటగాళ్లు:

షెర్ఫానే రూథర్‌ఫోర్డ్.
జేసన్ బెహ్రెండార్ఫ్ (ట్రేడ్ చేయబడ్డాడు)
లువ్నిత్ సిసోడియా.
అనీశ్వర్ గౌతమ్.
చామా మిలింద్.

Also Read: Palash – Smriti: స్మృతి పెళ్లిపై మరో ట్విస్ట్… పలాష్ ముచ్చల్ తో ఎఫైర్ పై మేరీ డి’కోస్టా సంచలన పోస్టు!

మునుపటి సీజన్లలోని విడుదలలు:

IPL 2014 ముందు: ఆల్బీ మోర్కెల్, మిచెల్ స్టార్క్, యువరాజ్ సింగ్, (వేలంలో తిరిగి కొనుగోలు చేశారు).

IPL 2013 ముందు: మహ్మద్ కైఫ్, చార్ల్ లంగేవెల్డ్ట్, డిర్క్ నాన్స్, ల్యూక్ పోమర్స్‌బాచ్, రిలీ రోసౌ.

ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. ఇలా ప్రతి సంవత్సరం కీలక ఆటగాల్లను వదులుకొని కప్ గెలిచేందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ కీలక ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీలలో ఉన్నప్పుడు అద్భుతంగా రాణించి.. ఆర్సిబి లోకి రాగానే పూర్తిగా విఫలమయ్యేవారు.

Tags

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×