E-Paper
Advertisement

Meenakshi Chaudhary : బాలీవుడ్ లోకి మీనాక్షి ఎంట్రీ.. వర్కౌట్ అవుతుందా..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ లోకి మీనాక్షి ఎంట్రీ.. వర్కౌట్ అవుతుందా..?
Advertisement

Meenakshi Chaudhary : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఈమె ఒక్క సినిమా తో తన క్రేజ్ ను పెంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. రీసెంట్ గా ఈమె నవీన్ పోలీస్ నటించిన అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆమె ఏ సినిమాతో అడుగుపెట్టబోతుంది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

మీనాక్షి బాలీవుడ్ ఎంట్రీ..

తెలుగులో ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది.. ప్రస్తుతం బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుంది. అక్షయ్ కుమార్ సరసన ‘భాగమ్ భాగ్ 2’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు గతంలో వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అని సొంతం చేసుకుంది. కామెడీ మూవీకి సీక్వెల్‌గా ఉండబోతోంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి తో పాటుగా నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయేషా ఖాన్ కీలక పాత్రలు వంటి ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మీనాక్షి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.. తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read :ఇన్స్టాగ్రామ్ బ్యాన్ పై స్పందించిన అన్వేష్.. బత్తాయిలకు నరకం చూపిస్తాను..

షూటింగ్ అప్పుడే స్టార్ట్…

ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ఇటీవలే పూర్తి అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సినిమాను 2026 చివరి నాటికి థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తెలుగు, తమిళ్, భాషల్లో మంచి సక్సెస్ ని అందుకున్న మీనాక్షి చౌదరి బాలీవుడ్ లో అక్షయ్ సరసన ఎలా అలరిస్తుందో చూడాలి.. ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్లందరూ కూడా బాలీవుడ్ బాట పడుతున్నారు.. అయితే ఇప్పటివరకు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో రష్మిక మందన్న ఒక్కటే హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన హీరోయిన్లకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. మరి మీనాక్షి చౌదరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×