E-Paper
Advertisement

Kalyan Ram: థ్రిల్లర్ జానర్ లోకి కళ్యాణ్ రామ్.. రూట్ మార్చినట్టేనా?

Kalyan Ram: థ్రిల్లర్ జానర్ లోకి కళ్యాణ్ రామ్.. రూట్ మార్చినట్టేనా?
Advertisement

Kalyan Ram:నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. యంగ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అటు విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే ఇన్ని రోజులు మాస్, యాక్షన్ జానర్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా తనను తాను మార్చుకొని యూ టర్న్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కొత్త ప్రయాణంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సక్సెస్ అందుకుంటారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

జానర్ మార్చిన కళ్యాణ్ రామ్..

నిజానికి ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచిలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో సెంటిమెంట్, ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్ ఫాంటసీ, థ్రిల్లర్ మిస్టిక్ లకు జై కొట్టిన ఆడియన్స్.. ఇప్పుడు పురాణాల ఆధారంగా నిగూఢ రహస్యాలు, భక్తి , సైకాలజికల్ థ్రిల్లర్ వంటి విభిన్న అంశాల మేళవింపుతో వచ్చే సినిమాలకే ఓటు వేస్తున్నారు. లోతైన కథనం, విజువల్గా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ట్రెండుకు తగ్గట్టుగా విరూపాక్ష, కార్తికేయ 2, కిష్కిందపురి ఇలా కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేక్షకుడికి వినోదంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలు ఉంటేనే వాటికి ఆదరణ లభిస్తుంది. అందులో భాగంగానే హీరోలు కూడా ఒక్కొక్కరిగా తమ జానర్ ను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కూడా తన కొత్త జానర్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. మిస్టిక్ , థ్రిల్లర్ కోణంలో తన తదుపరి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.

Advertisement

ALSO READ:Dhanush: మృణాల్ ను సర్ ప్రైజ్ చేసిన ధనుష్.. మ్యాటర్ ఏంటంటే?

కొత్త దర్శకుడితో కొత్త ప్రయాణం..

ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముప్పా అశోక్ వర్ధన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం ద్వారా కథకు తగ్గట్టుగానే విజువల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు. బింబిసారా సినిమా తర్వాత వచ్చిన అమిగోస్, ది డెవిల్, సన్నాఫ్ జయంతి వంటి చిత్రాలు ఆశించినంత ఫలితాలను ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు తన జానర్ ను మార్చుకొని కంటెంట్ పై నమ్మకం ఉంచి కొత్త దర్శకులకు మళ్ళీ అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు కళ్యాణ్ రామ్. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి. ఇక కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు కాబట్టి ఆయన కూడా ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలదొక్కుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×