E-Paper
Advertisement

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి
Advertisement

Meenakshi Chaudhary:మినాక్షి చౌదరి..టాలీవుడ్‌లో తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అభిమానులను ఆకట్టుకుంటోందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా మినాక్షి చౌదరి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి .. వియత్నాంలోని నిన్ బిన్ ప్రాంతంలో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో “Ninh Binh kinda day” అంటూ క్యాప్షన్ అంటూ పోస్ట్ చేయగా మా మీనాక్షి లుక్స్ మాములుగా లావుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మీనూ ఫాన్స్ .

Advertisement

ఈ ఫొటోల విషయానికి వస్తే బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న డ్రెస్‌ కి మ్యాచింగ్‌గా వేసిన వియత్నామీస్ స్టైల్ టోపీ ఆమె లుక్ ని డబల్ చేసేసింది. ముఖ్యంగాఓల్డ్ ఆర్కిటెక్చర్ మధ్య,ఫుల్ గ్రీనిష్ బ్యాక్ గ్రౌండ్ లో మినాక్షి ఇచ్చిన పోజులు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.

సాధారణంగా సినిమా హీరోయిన్లు తమ సినిమాల ప్రమోషన్లు, ఫొటోషూట్లతో అభిమానులకు దగ్గరవుతుంటారన్న సంగతి తెల్సిందే. కానీ మినాక్షి మాత్రం తన పర్సనల్ ట్రిప్స్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ టచ్‌లో ఉండటంతో మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

Advertisement

ఇక మినాక్షి చౌదరి కెరీర్ విషయానికి వస్తే, మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో అందం మాత్రమే కాకుండా నటనకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడం విశేషం.

ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించిన మీనూ . ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అలాగే వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన ‘మట్కా’ సినిమాలోనూ మినాక్షి కనిపించి మెప్పించింది కూడా .

ఇక కోలీవుడ్‌లో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) సినిమాలోనూ కనిపించిన మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.

సినిమాల సంగతి పక్కన పెడితే, మినాక్షి పెట్టె సోషల్ మీడియా పోస్టులకు మంచి రియాక్షన్ వస్తుంటుంది. ముఖ్యంగా ఆమె ఫొటోషూట్లు, వెకేషన్ పిక్స్ ఫాన్స్ లో మాంచి క్యూరియాసిటీ కలిగిస్తుంటాయి . ఇప్పుడు నిన్ బిన్ ట్రిప్ ఫొటోలు కూడా ఇలాగే నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి .

మొత్తానికి, సినిమాలతో బిజీగా ఉంటూనే తన ట్రావెల్ స్టోరీస్ ని అభిమానులతో పంచుకుంటున్న మినాక్షి చౌదరి మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.చూడాలి మరి సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ భామ ఎలాంటి సినిమాలతో ఆడియన్స్ ని పలకరిస్తుందో !

ALSO READ:మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్

Tags

Related News

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్

నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!

అబ్బా.. చీరలో రుక్మిణి వసంత్ లుక్ మామూలుగా లేదుగా!

రణబాలి డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?

రింగ్ దొరకక ప్రపోజ్ చేయలేదు.. ఆ మూమెంట్ మిస్సయిన రష్మిక: విజయ్ దేవరకొండ

Big Stories

Advertisement
×