Vijay Devarakonda -Prakash Raj: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj) తాజాగా సిఐడి (CID) కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా పలువురు హీరోలపై కేసులో నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇదివరకే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి తదితరులు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఇందులో భాగంగానే తాజాగా సిఐడి కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా సిఐడి కార్యాలయానికి వెళ్లడంతో అధికారులు వీరు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేయడమే కాకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది.
ఇదివరకే ఈ ఇద్దరి హీరోలకు విచారణ పూర్తి అయినప్పటికీ తాజాగా నేడు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందిన నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేడు విచారణకు హాజరయ్యారు. మరి ఈ విచారణలో అధికారులు వీరిని ఇంకా ఎలాంటి విషయాల గురించి అడిగారు ఏంటి అనేది తెలియాలి అంటే విచారణ పూర్తి అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు అలాగే ప్రాణా నష్టం కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ ఇకపై తాను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయనని వెల్లడించారు. అయితే విజయ్ దేవరకొండ తాను ప్రమోట్ చేసిన యాప్స్ చట్టబద్ధమైనవని ఈయన గతంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరు సిఐడి విచారణకు హాజరయ్యారు తదుపరి మరింత మంది సెలబ్రిటీలు కూడా ఈ విచారణలో పాల్గొనబోతున్నారు.
సినిమా పైరసీకి కారణమా?
ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో భాగంగా కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా యూట్యూబర్స్ పట్ల కూడా కేసులో నమోదు అయిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున సినిమాలకు కూడా నష్టాలు ఏర్పడటం, సినిమా పైరసీలకు గురికావడానికి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లే కారణమని ఇటీవల అధికారులు తెలియచేయడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అంటూ అందరూ ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇకపైనైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు పులి స్టాప్ పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్… ఫైనల్‌గా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత!