E-Paper
Advertisement

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

Meesala Lakshman:లక్ష్మణ్ మీసాల,…మంగళవారం’ సినిమాలో పులిరాజు పాత్రతో మెప్పించిన ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సుకుమార్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఎందుకు మిస్ అయ్యాయి?అజయ్ భూపతి ఎలాంటి వాడు  వంటి పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా ‘మంగళవారం’ సినిమాలో పులిరాజు పాత్ర గురించి మాట్లాడుతూ . ఆ క్యారెక్టర్ వెనుక ఓ నిజమైన వ్యక్తి ఉన్నాడని చెప్పుకొచ్చాడు . దర్శకుడు అజయ్ భూపతి తన ఊరిలో నిజంగానే పులిరాజు అనే వ్యక్తి ఉండేవాడని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. దీంతో ఈ పాత్రను ఎలా చేయాలనే విషయంలో తాను చాలా ఆలోచించినట్లు తెలిపారు. ఎందుకంటే నిజ జీవితంలో ఉన్న వ్యక్తిని తెరపై చూపించేటప్పుడు చిన్న తేడా వచ్చినా ప్రేక్షకులకు తెలిసిపోతుందని లోలోన ఫీల్ అయ్యి అచ్చం అలాగే చేసేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక ఈ పాత్ర కోసం అజయ్ భూపతిని దగ్గరగా గమనించానని ఆయన డైలాగ్స్ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్, కళ్లతో పలికించే ఎక్స్ప్రెషన్స్ చూసి తన పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నానని తెలిపాడు .అలా దర్శకుడు ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నడుస్తున్నారు? అనే విషయాలను గమనిస్తూ పులిరాజు పాత్రకు తనదైన శ్రమ చేశాను కాబట్టే ఇపుడు మంచి ప్రశంసలు దక్కాయని తెలిపాడు.

ఇక షూటింగ్ సమయంలో మాత్రం తనకు కొంచెం భయం ఉండేదని ఆ ప్రాంతంలో పులిరాజు పాత్ర గురించి స్థానికులకు ముందే తెలిసి ఉండటంతో, తాను చేసే నటన వారికి నచ్చుతుందా లేదా అనే సందేహం వచ్చేదని అనుకున్నానంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.. కానీ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు ఇచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని ,ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రేక్షకులు అరుస్తూ, చప్పట్లు కొడుతుంటే తనకే నమ్మశక్యంగా అనిపించలేదని చెప్పాడు .. తాను నటించిన పాత్రను ప్రేక్షకుడిలా చూసినప్పుడు వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.

Advertisement

ఇక దర్శకుడు అజయ్ భూపతి గురించి మాట్లాడుతూ కోపం వచ్చినప్పుడు చాలా సీరియస్ అవుతాడని,కానీ కొద్దిసేపటికే మళ్లీ మామూలుగా అయిపోతారని చెప్పాడు . పని విషయంలో మాత్రం ఆయనకు చిన్నా, పెద్దా అనే తేడా ఉండదని, తనకు కావాల్సిన పని చేయించుకుంటారని వివరించాడు.మరోవైపు సుకుమార్ సినిమాల్లో అవకాశాల గురించి మాట్లాడుతూ ‘కుమారి 21ఎఫ్’ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి, సెలెక్ట్ అయినప్పటికీ చివరకు ఆ అవకాశం చేజారిపోయిందని వాపోయాడు. సినిమా లేట్ అవడం, ఈలోపు టీమ్‌లో చేంజెస్ రావడం వల్ల తనకు ఆ పాత్ర దక్కలేదని వివరించాడు . సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవని, కొన్ని అవకాశాలు అలా చేజారిపోతుంటాయని అన్నాడు.

ఇక ‘రంగస్థలం’ సినిమా కోసం కూడా ఆడిషన్ ఇచ్చి మరీ సెలెక్ట్ అయ్యానని కానీ తాను నటించిన సీన్స్ చివరకు సినిమాలో కనిపించలేదని చెప్పారు. ‘పుష్ప’ సినిమా కోసం కూడా తనను పిలిచారని, కానీ ఆ సమయంలో మరో షూటింగ్‌లో ఉండటంతో వెళ్లలేకపోయానని బాధ పడిపోయాడు.

అయితే వీటి గురించి తాను పెద్దగా బాధపడనని ఏ పాత్ర ఎవరికి దక్కాలో అలా జరుగుతుందని, మనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే ముఖ్యమని మీసాల చెప్పడం బట్టి చూస్తే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు సరైన సమయంలో అవకాశం రావడం కూడా చాలా ముఖ్యమనే విషయం అర్థమవుతోంది.
.Also read:RC17 మ్యూజిక్ డైరెక్టర్‌పై సస్పెన్స్.. సుకుమార్ వచ్చాకే ఫైనల్!

Tags

Related News

రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?

రింగ్ దొరకక ప్రపోజ్ చేయలేదు.. ఆ మూమెంట్ మిస్సయిన రష్మిక: విజయ్ దేవరకొండ

RC17 మ్యూజిక్ డైరెక్టర్‌పై సస్పెన్స్.. సుకుమార్ వచ్చాకే ఫైనల్!

ట్విస్ట్ కనిపెడితే కోటి రూపాయలు మీవే.. బంపర్ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్!

నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం? లిటిల్ హార్ట్ మౌళికి వార్నింగ్!

నాన్నతో కోల్డ్ వార్.. పెళ్లికి ముందే విభేదాలు.. ఉత్తేజ్ కూతురు చేతన షాకింగ్ కామెంట్స్!

ఉత్తేజ్ కూతురు చేతన జీవితంలో ఇన్ని కష్టాలా?

Big Stories

Advertisement
×