Vijay Devarakonda -Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్ ఆయన విజయ్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నవి ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ జంట రణ బాలి (Ranabaali)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika)వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేశారు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షో(Koffee With Karan Talk show) లో ఈ జంట పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక తమ ప్రేమకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ రష్మికకు ప్రపోజ్ చేయడం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రష్మికకు తాను ప్రపోజ్ చేయాలనుకున్నాను కానీ సరైన సమయంలో రింగ్ దొరకకపోవడంతో ప్రపోజ్ చేయలేకపోయానని ఈయన అసలు విషయం తెలిపారు. తాను సాధారణంగా రొమాంటిక్ విషయాలను పెద్దగా ప్లాన్ చేయను కానీ తన వల్ల రష్మికకు ప్రపోజల్ కు సంబంధించి ఒక క్యూట్ మూమెంట్ మిస్ అవుతుందని భావించాను అందుకే మా పెళ్ళికి ముందు మేమిద్దరం కలిసి ఇటలీ వెకేషన్ వెళ్ళాము అక్కడ మోకాళ్లపై కూర్చుని తనకు ప్రపోజ్ చేయాలని భావించాను కానీ సరైన సమయంలో నాకు రింగ్ దొరకకపోవడంతో తనకు ప్రపోజ్ చేయలేకపోయానని తెలిపారు. ఆ క్షణం రష్మిక ఒక క్యూట్ మూమెంట్ మిస్ అయిందని చాలా భావించాను.
రష్మిక జీవితంలో ఇలాంటి లోటు ఉండకూడదని భావించి తాను తమ పెళ్లి సంగీత్ వేడుకలో భాగంగా తన స్నేహితులందరినీ ఒకచోటకు పిలిచి రష్మిక ముందు మోకాళ్ళపై కూర్చొని తన వేలికి రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చేశానని తెలిపారు. అలా తాను ప్రపోజ్ చేసిన ఆ క్షణాలు రష్మిక జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా తన లవ్ స్టోరీ గురించి చెప్పడంతో వెంటనే కరణ్ జోహార్ మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అంటూ ప్రశ్నించారు దీంతో విజయ్ దేవరకొండ ముందు రష్మిక తనకు ప్రపోజ్ చేసిందని తాను ఓకే చెప్పేలోపు ఒక వంద సార్లు తనని పెళ్లి చేసుకోవాలి అంటూ ఆమె అడిగిందని విజయ్ దేవరకొండ తమ క్యూట్ లవ్ స్టోరీకి సంబంధించిన విషయాలను బయట పెట్టడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
Also Read: ట్విస్ట్ కనిపెడితే కోటి రూపాయలు మీవే.. బంపర్ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్!