E-Paper
Advertisement

Mega 158: ‘మెగా 158’లో మళయాళం స్టార్ మోహన్ లాల్ చేయబోయే పాత్ర ఇదే.. ఫ్యాన్స్‌కు పండగే..

Mega 158: ‘మెగా 158’లో మళయాళం స్టార్ మోహన్ లాల్ చేయబోయే పాత్ర ఇదే.. ఫ్యాన్స్‌కు పండగే..
Advertisement

Mega 158: మెగాస్టార్ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెగా 158’ తాజగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషట్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మెగా 158 సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నటిస్తున్నారన్న వార్త తెలిసింది. అయితే ఆయన కామియోలో చేయబోతున్నారా లేదా ఫుల్ లెంత్ చేయబోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. మెగా 158 సినిమాలో మోహన్ లాల్ వేయబోయే పాత్ర పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. అదే పాత్ర సినిమాకు చాలా ఇంపార్టెంట్, అని అందుకే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నానని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మన శంకర వర ప్రసాద్ సినిమాతో మంచి హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే రామ్ చరణ్ దంపతులకు కూడా జన్మించడంతో ఆయన మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read also-Niharika: నిహారిక మనసులో అంత బాధ ఉందా.. పైకి కనిపించట్లేదు కానీ?

మోహన్ లాల్ పాత్ర ఏంటి?

Advertisement

మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇది కేవలం కామియో మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన “గాడ్‌ఫాదర్” తరహా పాత్ర అని టాక్. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న నేపథ్యంలో, పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ లాల్ ఎంట్రీ సెకండాఫ్‌లో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని వినికిడి. చిరంజీవి తన కెరీర్‌లో తొలిసారిగా ఈ సినిమాలో పూర్తిస్థాయి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కథలో కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతోందట. ఈ ప్రాజెక్టులో మోహన్ లాల్‌తో పాటు బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందని, అలాగే చిరంజీవికి కూతురిగా యంగ్ హీరోయిన్స్ శ్రీలీల లేదా అనస్వరా రాజన్ పేర్లు వినిపిస్తున్నాయి.

Read also-Podarillu Today Episode : మహా, చక్రీ మధ్య గొడవ.. గాయత్రి ఎమోషనల్.. మహాకు షాకిచ్చిన మాధవ్..

రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ దంపతులకు కవలలు (పాప, బాబు) జన్మించడంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంతోషంలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ‘మెగా 158’ నుంచి వస్తున్న ఇటువంటి అప్‌డేట్స్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వస్తే మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×