E-Paper
Advertisement

Niharika: నిహారిక మనసులో అంత బాధ ఉందా.. పైకి కనిపించట్లేదు కానీ?

Niharika: నిహారిక మనసులో అంత బాధ ఉందా.. పైకి కనిపించట్లేదు కానీ?
Advertisement

Niharika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మెగా ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి సుమారుగా 10 మందికి పైగా హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే అలాంటి బడా కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన అమ్మాయి నిహారిక (Niharika )మాత్రమే. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత హీరోయిన్ గా సత్తా చాటాలనుకుంది. అందులో భాగంగానే ఒక మనసు, సూర్యకాంతం వంటి చిత్రాలలో లీడ్ రోల్ పోషించింది
కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభించలేదు.

దీనికి తోడు గత ఏడాది తమిళ్లో కూడా హీరోయిన్గా ఒక సినిమా చేసింది. కానీ పెద్దగా స్టార్ ఇమేజ్ అయితే లభించలేదు. పైగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ అది కూడా వర్క్ అవుట్ కాక పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా అవతరించింది.

పైకి కనపడకపోయినా మనసులో ఏదో బాధ..

Advertisement

అందులో భాగంగానే కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యింది . ఇప్పుడు సంగీత శోభన్ తో మరో సినిమా చేస్తోంది నిహారిక. ఇదిలా ఉండగా మరొకవైపు నిహారిక కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అసలు కారణం నిహారిక వదిన , మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ భార్య అయిన ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. పండంటి అబ్బాయికి, అమ్మాయికి జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో నిహారిక చేసిన కామెంట్లు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పైకి కనిపించట్లేదు కానీ లోపల ఏదో తెలియని బాధ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నిహారిక.

also read:Shivaji SSS Movie: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రిలీజ్ డేట్ ఫిక్స్.. అదొక్కటే మిస్!

ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను..

Advertisement

తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంటూ….” నాలోపల ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతోంది. అది ఒత్తిడా? లేక బాధ? అన్న విషయం తెలియడం లేదు. కానీ మనసు మొత్తం ఒకటే బరువు. దాన్ని చెప్పడానికి కూడా నాకు పదాలు దొరకడం లేదు. ఈ బాధను తలుచుకొని కుంగిపోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కొన్ని కొన్ని సార్లు నేను జిమ్ కి వెళ్తుంటాను. బరువులు కూడా ఎత్తుతుంటాను . మరికొన్నిసార్లు వాకింగ్ చేస్తాను. ఇందులో ప్లానింగ్ చేయడానికి అంటే ఏమి ఉండదు. కానీ గుండె నిండా ఊపిరి పీల్చుకుంటూ నడుస్తున్నాను. ఇంకొన్నిసార్లు డాన్స్ చేస్తాను. యోగా చేస్తాను. ఇవన్నీ చేస్తుంటే మనసు తేలిక పడుతుంది. కానీ బయటకు ఏమీ మారడం లేదు. లోపల ఏదో మార్పు కానీ వ్యాయామం ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను” అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. నిహారిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అభిమానులు కామెంట్లు..

అయితే ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఆ బాధకు కారణం నీవు నీ భర్తకు దగ్గరగా లేకపోవడం వల్లే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావడంతో పెళ్లయిన మూడేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయింది నిహారిక. ఇక ఇప్పుడు జీవితంలో ఏదో తెలియని వెలితి ఏర్పడింది అంటూ చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

Big Stories

Advertisement
×