E-Paper
Advertisement

Iran Earthquake: ఇరాన్‌లో భూకంపం.. 5.3 గా నమోదు, ఖతార్‌-యూఏఈలో కూడా

Iran Earthquake: ఇరాన్‌లో భూకంపం.. 5.3 గా నమోదు,  ఖతార్‌-యూఏఈలో కూడా
Advertisement

Iran Earthquake: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3 గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా మెహర్, బిద్ధన్, అఖండ్ ప్రాంతాల్లో భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇరాన్‌లో భూకంపం.. 5.3 గా నమోదు

Advertisement

దక్షిణ ఇరాన్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటల కొన్ని ప్రాంతాలలో భూమి కంపించినట్లు అక్కటి జియోలాజికల్ సర్వే అథారిటీ విభాగం తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదు అయ్యింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కొన్నిచోట్ల భవనాలకు పగుళ్లు వచ్చినట్టు తెలిపారు అధికారులు.

ఆదివారం ఉదయం భూకంపం రావడంతో ప్రజలు పెద్దఎత్తున బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావం అటు ఖతార్‌లోనూ యూఏఈలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్టు ఆ దేశాలు వెల్లడించాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలిపాయి. దక్షిణ ఇరాన్‌లోని 10 కిలోమీటర్ల లోతుల్లో ఈ భూకంపం నమోదైంది.

Advertisement

ఖతార్‌-యూఏఈలో కూడా.. ఇరాక్ అణు పరీక్షలేనంటూ

ఇరానియన్ పీఠభూమిలో టెక్టోనిక్ కార్యకలాపాలకు నిత్యం జరుగుతుంటాయి. పొరుగునున్న అరేబియా ద్వీపకల్పానికి బఫర్‌గా పని చేస్తుంది.ఇరానియన్ భూకంప శాస్త్ర కేంద్రం, స్థానిక ప్రాంతీయ గవర్నర్ల అధికారిక ప్రకటనలు చేశారు. భూకంపం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపాయి. మోహర్, బిద్ఖున్, అఖండ్ ప్రాంతాల్లో కొంత నష్టం జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

దుబాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ-NCM ప్రకారం దక్షిణ ఇరాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. ఇరాన్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. ఇరాన్‌లో పెద్ద పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. 1990లో వాయువ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.  దాదాపు 37,000 మంది మరణించగా, 100,000 మందికి పైగా గాయపడిన విషయం తెల్సిందే.

ALSO READ: 40 గంటల్లో.. 145 మంది ఉగ్రవాదుల హతం

భూకంపం వెనుక మరొక వార్త లేకపోలేదు. ఇరాక్ అణు పరీక్ష వల్ల భూకంపం సంభవించిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహక నౌక మధ్యప్రాచ్యంలో మోహరించినందున ఈ చర్య అనుమానాస్పదంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి భూకంపం ఏమోగానీ అక్కడి ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయంతో ఉన్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×