Niharika Konidela: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా బ్రదర్ నాగబాబు వారసురాలిగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నిహారిక కొణిదెల (Niharika Konidela) పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ స్థాపించి మొదట్లో పలు వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె తన నిర్మాణ సారథ్యంలో మొట్టమొదటిసారి కమిటీ కుర్రోళ్ళు(Committie Kurrollu) అనే సినిమా ద్వారా వెండితెరకు నిర్మాతగా పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే నిహారిక నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా ద్వారా కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమాకు గాను ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె తన మొదటి సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డు (National Award)అందుకున్నారంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా కమిటీ కుర్రోళ్ళు సినిమాకు పెద్ద ఎత్తున అవార్డులను సొంతం చేసుకున్న నిహారిక తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు.
తాజాగా నిహారిక దేవి ఆఫ్ న్యూ నరేటివ్స్ (Devi Of New Narratives)అవార్డును సొంతం చేసుకున్నారు. డిజిటల్ మీడియాలో కొత్త తరహా కథలను పంచుకోవడంలో నిహారిక చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. ఇక ఈ అవార్డును నిహారిక తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున మెగా అభిమానులు నిహారికపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది రోజులకే నిహారిక నిర్మాతగా సక్సెస్ అందుకొని ఇలాంటి గొప్ప పురస్కారాలను అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ మెగా అభిమానులు ఈమె సక్సెస్ పై కామెంట్లు చేస్తున్నారు.
ఇలా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా తర్వాత అనంతరం రాకాసా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన మూడవ సినిమాని తన అన్నయ్య వరుణ్ తేజ్ కొణిదెల(Varun Tej Konidela)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బరి (Bhari Movie)అనే టైటిల్ ప్రకటించారు. గత కొద్ది నెలల క్రితం ఈ సినిమా ప్రకటించిన నిహారిక దసరా పండుగను పురస్కరించుకొని భూమి పూజ కార్యక్రమాలతో షూటింగ్ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: 40 ఏళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం ఆ పని చేసిన రజినీకాంత్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!