Rajinikanth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ తాజాగా జైలర్ 2(Jailer 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీ విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు 600 కోట్లపైగా కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఇంకా అదే దూకుడు కనబరుస్తుంది. ఇకపోతే జైలర్ 2 సినిమా ద్వారా రజనీకాంత్ తన 40 సంవత్సరాల సినీ కెరియర్ లో చేయని పనిని మొదటిసారి చేశారు. మరి రజినీకాంత్ చేసిన ఆ పని ఏంటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా ప్రతి ఒక్క హీరో అభిమాని తమ అభిమాన హీరోతో కలిసి థియేటర్లో ఒక్క సినిమా అయినా చూడాలని కోరుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో హీరోలు కూడా అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం తన 40 సంవత్సరాల సినీ కెరియర్ లో ఎప్పుడు కూడా అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూసింది లేదు . అయితే జైలర్ 2 సినిమా విషయంలో మాత్రం ఈయన తన 40 సంవత్సరాలలో మొదటిసారి అభిమానులతో కలిసి థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
For the first time in 40 years, Superstar @rajinikanth joins fans to witness #Jailer2 on the big screen!😎🔥
Watch #MegaBlockbusterJailer2 at theatres near you now! ❤️🔥
Book your tickets now! 🔥
🎟️ https://t.co/Tkxvho3fZK
🎟️ https://t.co/8vPUqTBDnP pic.twitter.com/a2wMnZzpkd— Sithara Entertainments (@SitharaEnts) October 24, 2026
ఇలా తలైవాతో కలిసి అభిమానులు థియేటర్లో ఏ సినిమా చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర నిర్మాతలు షేర్ చేశారు. ఇందులో భాగంగా రజనీకాంత్ శుక్రవారం చెన్నైలోని వేలచ్చేరిలో ఉన్న ఫీనిక్స్ మాల్‌లోని పీవీఆర్ సినిమాస్‌ను నిరాడంబరంగా సందర్శించారు. సన్ పిక్చర్స్ , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పంచుకున్న ఈ వీడియోలో, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో సహా కొద్దిమంది వ్యక్తులు మాల్ వద్ద సూపర్‌స్టార్‌కు స్వాగతం పలుకుతున్నట్లు కనిపించింది. ఇక వీరంతా కలిసి థియేటర్లో జైలర్ 2 సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను నాగవంశీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా నాగ వంశీ భారీ లాభాలను అందుకున్నారు.
Also Read: సుమ 116 ఏళ్ళు బ్రతకాలి..రాజీవ్ మాటలకు సుమ ఎమోషనల్!