E-Paper
Advertisement

Almond House లో స్వీట్స్ కొంటున్నారా.. అయితే ఒక్కసారి ఇది చూడండి?

Almond House లో స్వీట్స్ కొంటున్నారా.. అయితే ఒక్కసారి ఇది చూడండి?
Advertisement

Bakery Raid: మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఆర్టీసీ కాలనీలో బేకర్స్ పాయింట్ పేరుతో ఈ బేకరీ రన్ అవుతోంది. చూడటానికి చాలా నీట్‌గా, పోష్‌గా ఉంటుంది. షాపులోకి వెళ్లగానే షోకేస్ నిండా కలర్‌ఫుల్ కేకులు కనిపిస్తాయి. చూస్తేనే నోరూరుతుంది. కానీ లోపల జరుగుతున్న కథ తెలిస్తే గొంతులో చిన్న కేకు పీస్‌ కూడా దిగదు.

షాపు నిండా కాలం చెల్లిన సరుకులే..

కీసర పోలీసులు అక్టోబర్ 22న ఆ బేకరీపై మెరుపు దాడి చేశారు. అల్మారాలు తెరిచారు, రాక్‌లు వెతికారు. అసలు ఆ బేకరీలో ఏం దొరికాయో తెలిస్తే వాంతులవుతాయి. షాపు నిండా కాలం చెల్లిన సరుకులే.. ఆ దరిద్రం చూసి ఆఫీసర్లే తలలు పట్టుకున్నారు. సోడా, హ్యాపీ ఫీజ్, రియల్ జ్యూస్, చిప్స్.. దేన్ని పట్టుకొని చూసినా గడువు ఎప్పుడో ముగిసింది. ఐనా వాటినే కస్టమర్లకు అంటగడుతున్నారన్నమాట. ఇంకో బిగ్ షాక్ ఏంటంటే.. కేకుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. పిల్లలు ఇష్టంగా తినే కేకుల వెనక రంగుల మాయ ఉంది. అవి పిల్లలు కడుపులోకి వెళ్తే.. వాళ్ల ఆరోగ్యం ఏమైపోవాలి.

గడువు తీరిన సరుకును సీజ్..

Advertisement

అసలు మతలబు ఏంటంటే ఈ బేకరీని ట్రేడ్ లైసెన్స్ లేకుండానే రన్ చేస్తున్నారు. అనుమతి లేదు, జవాబుదారీ లేదు, కానీ గల్లా పెట్టె మాత్రం గలగల అంటూ సౌండ్ చేస్తోంది. పోలీసులు ఆ గడువు తీరిన సరుకును సీజ్ చేశారు. బేకరీ నిర్వాహకుడు జాదవ్ సంతోష్‌పై కేసు ఫైల్ చేశారు. ఐనా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఇన్నాళ్లు ఈ ఐటెమ్స్ తిన్న కస్టమర్ల హెల్త్ కండీషన్ ఏమైపోవాలి. ఇలాంటి పర్మిషనల్ లేని షాపులు ఈ హైదరాబాద్‌లో ఇంకెన్ని ఉన్నాయో.. ఎంతమంది ఆరోగ్యాల్ని తినేస్తున్నాయో.. ఎంత టేస్ట్‌ ఉన్నా.. ఎంత ఇష్టం ఉన్నా అవుట్‌సైడ్ ఫుడ్‌ వద్దు భయ్యా తింటే పోతావు.. హాస్పిటల్‌కో.. పైకో.. ఇక్కడ పోవడం మాత్రం గ్యారెంటీ.

Also Read: నా ప్రాణం తీద్దామని చూశారు.. కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు!

Tags

Related News

ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవుల రచ్చ.. బీసీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తారా?

నా ప్రాణం తీద్దామని చూశారు.. కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు!

మారనున్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం రూపురేఖలు.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!

దుండిగల్‌లో దారుణం.. ఇంటి తాళాలు పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించిన రౌడీషీటర్!

శంషాబాద్‌లో హవాలా గుట్టు రట్టు.. కోటి 56 లక్షల విదేశీ కరెన్సీ సీజ్!

ప్రాజెక్టులు కట్టింది మీరు.. కూలిపోతే మమ్మల్ని అంటారా?: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్?

Big Stories

Advertisement
×