E-Paper

Viswambhara Movie : చిరు ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Viswambhara Movie : చిరు ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!
Advertisement

Viswambhara Movie : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. మరో కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఆయన నటించిన విశ్వంభర సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుందంటూ ఓ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ నిజానికి ముందే రిలీజ్ అవ్వాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. ఇక దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మెగా ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ రెడీ.. 

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వంభర మూవీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. విజువల్స్ కారణంగానే ఈ సినిమా ఆలస్యమైందన్న విషయాన్ని గతంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ‘విశ్వంభర’ నుంచి మేకర్స్ నెక్స్ట్ మరో సాలిడ్ ట్రీట్ ని అందించనున్నారని తెలుస్తుంది.. మరో టీజర్ వీడియోను కట్ చేసి రెడీగా ఉంచారని ఫిలిం నగర్ లో టాక్.. దీంతో ఆడియెన్స్ లో మరింత అంచనాలు అందుకుంటుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారట.. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమా అవుతుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Advertisement

Also Read : శ్రీవల్లికి షాకిచ్చిన విశ్వం.. ఊహల్లో తేలిపోతున్న ప్రేమ.. ధీరజ్ కు నర్మద క్లాస్..

విశ్వంభర మూవీ విషయానికొస్తే.. 

చిరంజీవి, వశిష్ట కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ డిలే కావడం, బిజినెస్‌ కాకపోవడం, దీంతోపాటు కొంత అర్థిక కారణాలతోనూ వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. చందమామ కథల లాంటి స్టోరీతో మూవీని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్లతోపాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కూడా ఉంటాయట. భార్యకోసం భర్త వెతికే సీన్లు, తండ్రి కోసం కొడుకు పడే బాధ, దేవుడితో చెప్పుకునే సన్నివేశాలు గుండెల్ని హత్తుకునేలా ఉంటాయని తెలుస్తుంది.. మొత్తానికి విజువల్ వండర్ గా మాత్రమే కాదు. ఎమోషనల్ గా స్టోరీ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.. మరి మెగాస్టార్ కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి విజువల్ వండర్స్‌ను ‘విశ్వంభర’ గుర్తు చేస్తుందో లేదో చూడాలి..

Related News

సుకుమార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

Movies in Theater : ఈ వారం బాక్సాఫీస్ వార్.. థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలు..

Gv Prakash : మోసపోయిన జీవీ ఆ పని ఆపలేదు.. ఎంతైన హీరో గ్రేట్ అంతే..

రౌడీ హీరోతో ‘మమ్మీ’ విలన్ ఢీ..మైండ్ బ్లాక్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో అల్లు అర్జున్ ‘AA23’ థీమ్ మ్యూజిక్..

అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుండి ‘గుండె పేలిపోతోందే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ‘హెల్లాల్లోల్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?

×