E-Paper
Advertisement

Indian Army Power: వెన్ను చూపని ధైర్యం.. మీసం మెలేసే పొగరు.. ది గ్రేట్ ఇండియా ఫౌజి

Indian Army Power: వెన్ను చూపని ధైర్యం.. మీసం మెలేసే పొగరు.. ది గ్రేట్ ఇండియా ఫౌజి

Indian Army Power: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా! ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి రొమ్ము విరుచుకుంటుంది. భారత జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది. బ్రిటీష్ బానిస సంకెళ్లని తెంచుకొని, స్వాతంత్ర్యం సాధించి, గణతంత్ర దేశంగా మారి 76 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది మన భారత్. ఇప్పుడు 77వ రిపబ్లిక్ వేడుకలకు సిద్ధమవుతోంది. మరి.. ఇన్నేళ్లలో ఇండియన్ ఆర్మీ ఎలా మారింది? భారత్ ఎంత శత్రుదుర్భేద్యంగా మారింది? ఆపరేషన్ సిందూర్ తర్వాత.. ప్రపంచ దేశాలు భారత్‌ని ఇప్పుడెలా చూస్తున్నాయ్?

ఇది నయా ఇండియా… శాంతి కాదు, శక్తే సమాధానం!

ఎస్.. ఇండియా మారింది. శత్రుసేనలు కవ్విస్తే శాంతి మంత్రం జపించే దేశం కాదిప్పుడు. ఇది నయా ఇండియా! ఈట్ కా జవాబ్.. పత్తర్ సే అన్నట్లుగా ఉంది పరిస్థితి ఇప్పుడు. బ్రిటీష్ బానిస సంకెళ్లని తెంచుకొని. సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ గణతంత్ర దేశంగా అవతరించిన భారత్.. 76 ఏళ్లు పూర్తి చేసుకొని 77వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఎర్రకోట పైన ఎగురుతున్న త్రివర్ణ పతాకం సాక్షిగా.. భారత సైన్యం పటిమ.. ఇప్పుడు ప్రపంచ దేశాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్, నేడు సొంతంగా ఆయుధాలను తయారుచేసి, వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.

స్వదేశీ శక్తితో సూపర్ పవర్ దిశగా భారత్

1950లో భారత్ గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు, మన సైన్యం దగ్గర ఎక్కువగా బ్రిటీష్ కాలం నాటి ఆయుధాలే ఉండేవి. కానీ.. 75 ఏళ్ల తర్వాత ఆర్మీలో సీన్ పూర్తిగా మారిపోయింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. తేజయ్ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, అర్జున్ ట్యాంకులతో.. భారత సైన్యం కొత్తగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ భారత్‌దే. అగ్ని సిరీస్ క్షిపణులతో.. ఖండాంతర లక్ష్యాలను సైతం ఛేదించే సామర్థ్యం మనకు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డ్రోన్ వార్ ఫేర్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లోనూ.. ఇండియన్ ఆర్మీ అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతోంది.

దేశం కోసం ప్రాణం.. సరిహద్దుల్లో ఉక్కు గోడలా మన సైన్యం

సరిహద్దుల్లో మన ఆర్మీని చూస్తేనే.. శత్రు సేనలు సగం ఛస్తాయ్. హిమాలయాలైనా, సముద్ర కెరటాలైనా, దట్టమైన దండకారణ్యమైనా, తట్టుకోలేని వేడి ఉండే ఎడారులైనా, ఎక్కడైనా సరే.. దేశం విషయంలో భారత సైనికుల పొగరు ఎందులోనూ తగ్గదు. నిత్యం మృత్యువుకు ఎదురొడ్డి నిలుస్తూ.. శత్రువులు ఈ నేలలోకి చొరబడకుండా తమ ప్రాణం అడ్డేస్తారు. అందుకే.. పరాక్రమానికి కేరాఫ్ మన ఆర్మీ. పొంచి ఉండే ముప్పుకు.. ముందు అడ్డంగా నిలబడిపోతారు. ఎన్నో యుద్ధాలు, మరెన్నో స్పెషల్ ఆపరేషన్లు, మైండ్ బ్లాంక్ అయ్యే స్ట్రైక్స్, ఓటమెరుగని విజయాలు.. ఇండియా ఖాతాలో ఇలాంటివెన్నో ఉన్నాయంటే అందుకు కారణం మన సైనికుల పోరాట పటిమే! పరిస్థితులకు తగ్గట్లుగా మారుతూ వస్తున్న ఇండియన్ ఆర్మీ.. ఇప్పుడు సరికొత్త రూపంలో మనముందు నిలిచింది. టెక్నాలజీని బలంగా మార్చుకొని, రాకెట్ స్పీడ్‌తో రియాక్ట్ అవుతూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ట్రెడిషనల్ వార్‌ఫేర్‌ని పక్కనపెట్టి, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందిపుచ్చుకొని.. యుద్ధరగంలో అదరగొడుతోంది. ఎవ్వరైనా సరే, భారత్ జోలికి రానంత వరకే. ఒక్కసారి ఇండియాని టచ్ చేస్తే.. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు శత్రుసేనలకు బాగా తెలుసు.

భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమైన ఇండియన్ ఆర్మీ

ఒకప్పుడు ధైర్య,సాహసాలే భారత సేనల బలం. కానీ.. ఇప్పుడలా కాదు. ఆటోమేటిక్ వెపన్స్, అత్యాధునిక తుపాకులు, మిసైల్స్, డ్రోన్లు.. ఇలా చాలానే ఉన్నాయ్. డ్రోన్‌ వార్ ఫేర్ లేటెస్ట్ ట్రెండ్. అందుకోసమే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలో డ్రోన్ ప్లాటూన్లని ఏర్పాటు చేస్తోంది. సూసైడ్ డ్రోన్లని కూడా సమకూర్చుకుంది. మనవైపు ప్రాణ నష్టం లేకుండా, శత్రుసేనల ప్రాణాలు తీసేలా ఆర్మీ అప్‌డేట్ అయింది. శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్, స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆర్టిలరీ గన్స్‌ ధనుష్, కే-9 వజ్ర.. ఆకాశం నుంచి వచ్చే శత్రు దేశాల ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను గుర్తించి.. కూల్చేసే సమర్ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ లాంటివన్నీ.. ఇండియన్ ఆర్మీ సొంతం. ఇటీవలే.. రైఫిల్‌తో కూడిన రోబోటిక్ డాగ్‌ని కూడా సైన్యం ప్రదర్శించింది. భవిష్యత్ యుద్ధతంత్రాల్లో భాగంగా.. వీటిని డిజైన్ చేశారు. యుద్ధ క్షేత్రంలో సైనికులకు కావాల్సిన ఆహారం, ఆయుధాలు అందించడమే కాదు.. బాంబ్‌ డిస్పోజల్స్, ఇంటెలిజెన్స్‌ సేకరణకు ఇవి ఉపయోగపడనున్నాయ్. రక్షణ రంగంలో భారత్ హైటెక్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

చీకట్లోనూ శత్రువుకి చాన్స్ లేదు.. హైటెక్ ఆర్మీతో భారత్ రెడీ!

సరిహద్దుల్లోకి ఎవరు చొరబడాలని చూసినా.. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉండే ఏఐ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. మంచుకొండల్లో అయినా, కటిక చీకట్లోనైనా శత్రువు కదిలితే చాలు వెంటనే అలర్ట్ చేస్తాయ్ ఈ కెమెరాలు. ఇక శత్రుదేశాల డ్రోన్లని పసిగట్టి, వాటి సిగ్నల్స్ జామ్ చేయడమే కాదు దారిమళ్లించేందుకు కూడా సాఫ్ట్ కిల్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది ఇండియన్ ఆర్మీ. కేవలం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడమే కాదు.. అత్యాధునిక ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. మన సైన్యం దగ్గర ప్రస్తుతం స్టెర్లింగ్ కార్బైన్ గన్స్ ఉన్నాయ్. వీటి స్థానంలో.. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ గన్‌లు రానున్నాయ్. దీనికోసం.. డీఆర్డీవోతో డీల్ కూడా కుదిరింది. క్లోజ్ కాంబాట్‌లో ఈ గన్స్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయ్. త్వరలోనే ఇండియన్ ఆర్మీ చేతికి 4 లక్షలకు పైగా గన్స్ అందనున్నాయి. ఇక.. శత్రుసేనలు సంధించే మిసైళ్లని గాల్లోనే పేల్చేసేందుకు.. ఎస్-400 లాంటి యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా భారత్ దగ్గరుంది. దూరంలో ఉన్న టార్గెట్లని అత్యంత కచ్చితత్వంతో పేల్చేసే.. పినాక రాకెట్ సిస్టమ్ కూడా త్వరలోనే సైన్యం చేతికి అందనుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలు, డ్రోన్లని కనిపెట్టేందుకు.. లైట్ వెయిట్ రాడార్లని కూడా ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు వేగంగా ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కూడా ఆర్మీకి అందించనుంది భారత ప్రభుత్వం.

చైనా–పాక్ సవాళ్లను ఎదుర్కొన్న భారత్

ఆపరేషన్ సిందూర్‌తో కలిపి పాకిస్థాన్‌తో ఐదు సార్లు, చైనాతో ఒకసారి భారత్ యుద్ధం చేసింది. మధ్యమధ్యలో సరిహద్దుల్లో ఘర్షణలు, కాల్పులు, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్‌స్ట్రైక్స్, మిలిటెంట్ ఆపరేషన్లు.. అదనం. అన్నింట్లోనూ.. భారత్‌దే పైచేయి. అత్యాధునిక ఆయుధాలు ఉన్నా, లేకపోయినా.. భారత సైనికుల ధైర్య,సాహసాలు, పరాక్రమం ముందు శత్రుసేనలు తేలిపోతూనే ఉన్నాయ్. అడ్వాన్స్‌డ్ వెపన్స్, ఆర్టిలరీ, బెటాలియన్లతో.. ఇండియన్ ఆర్మీ మరింత శత్రుదుర్భేద్యంగా మారింది.

ప్రపంచ వేదికపై భారత సైన్యం.. శక్తిలో నాలుగో స్థానం

ఇండియన్ ఆర్మీ.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బలగాల్లో ఒకటి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యాల్లో.. భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత సైన్యంలో సుమారు 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీరికి తోడుగా 10 లక్షల మంది రిజర్వ్ బలగాలు, మరో 25 లక్షల మంది పారా మిలిటరీ బలగాలు రక్షణ కవచంలా ఉన్నాయ్. కేవలం సంఖ్యలోనే కాదు.. సాంకేతికతలోనూ ఇండియా అగ్రెసివ్‌గా ముందుకెళ్తోంది. బ్రహ్మోస్ లాంటి మిసైళ్లు, అగ్ని-5 లాంటి ఖండాంతర క్షిపణులు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు.. భారత్ బలానికి నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ సహా, ఎడారులు, దట్టమైన అడవుల్లో పోరాడగలిగే సుశిక్షిత సైన్యం ఒక్క భారత్‌కు మాత్రమే సొంతం.

శత్రు భూభాగంలోకి దూసుకెళ్లే కొత్త శక్తి

ఆధునిక యుద్ధ తంత్రానికి అనుగుణంగా.. భారత సైన్యం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పే.. భైరవ్ బెటాలియన్లు. వీటిని ప్రకటించిన ఏడాదిలోనే.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి.. సాధారణ బెటాలియన్ల కంటే చిన్నవిగా కనిపిస్తాయ్. ఇందులో కేవలం 250 మంది సైనికులు మాత్రమే ఉంటారు. కానీ.. అత్యంత శక్తిమంతంగా పనిచేస్తాయ్. సాధారణ పదాతి దళానికి, స్పెషల్ ఫోర్సెస్‌కి మధ్య వారధిగా పనిచేసేత్యా ఈ భైరవ్ బెటాలియిన్లు. శత్రు భూభాగంలోకి వేగంగా చొచ్చుకెళ్లి, మెరుపుదాడులు చేయడంలో ఇందులోని సైన్యం స్పెషాలిటీ. ఈ బెటాలియన్లలో డ్రోన్ ఆపరేటర్లు, ఏఐ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. డ్రోన్ల సాయంతో శత్రువుల కదలికలను ముందే కనిపెట్టి, ప్రాణ నష్టం లేకుండా.. టార్గెట్లని ధ్వంసం చేయడమే వీరి ప్రత్యేకత. ఈ భైరవ్ బెటాలియన్లను లద్దాఖ్, శ్రీనగర్ లాంటి సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఐదు భైరవ్ బెటాలియన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆర్మీ వీటిని ఉత్తర, పశ్చిమ, తూర్పు కమాండ్లలో మోహరించింది. మరో నాలుగు బెటాలియన్లకు వేగంగా శిక్షణ కొనసాగుతోంది. త్వరలోనే ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి.

భారత్ సిద్ధం.. శత్రుదేశాలకు నిద్రలేని రాత్రులు

సరిహద్దుల్లో వేగంగా రియాక్ట్‌ అయ్యేందుకు ఓ స్పెషల్‌ ఫోర్స్‌ ఉండాలనే ఆలోచనతోనే ఈ బెటాలియన్ రూపొందింది. ఇండియన్ ఆర్మీలోని.. రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఫ్రేమ్ వర్క్ కింద.. భైరవ్ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. శత్రువుల స్థావరాల్లోకి చొరబడి, డ్రోన్ల సాయంతో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయడం వీరి ప్రత్యేకత. అదనంగా ఇన్‌ఫాంట్రీ, ట్యాంకులు, ఆర్టిలరీ, డ్రోన్ వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ.. రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో సంపూర్ణ యుద్ధ వ్యవస్థను కూడా ఆర్మీ సిద్ధం చేసింది. సో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. శత్రుదేశాలు భారత్‌ని ఎదుర్కోవడం కష్టమే! ఎందుకంటే.. ఇండియా ఇప్పుడు టూ-ప్రంట్ వార్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఉరీ, బాలాకోట్ దాడుల తర్వాత భారత్ అవలంబిస్తున్న ప్రో-యాక్టివ్ పాలసీ.. శత్రుసేనలకు వణుకు పుట్టిస్తోంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ని ఏకం చేసి.. థియేటర్ కమాండ్స్ ద్వారా ఉమ్మడి దాడులు చేసేలా సరికొత్త వ్యవస్థలను భారత్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే.. ఇండియన్ ఆర్మీ 2026ని ట్రానిషన్ ఇయర్‌గా ప్రకటించింది. కేవలం సరిహద్దులను కాపాడటమే కాదు, సైబర్ దాడులు, డ్రోన్ యుద్ధ తంత్రాలను ఎదుర్కోవడంలోనూ.. భారత్ ప్రపంచ మేటి దేశాల సరసన ఉంది.

ప్రపంచానికి చూపిన వ్యూహాత్మక శక్తి

భారత రక్షణ రంగ చరిత్రలో ఆపరేషన్ సిందూర్ ఓ గ్రేట్ మైల్ స్టోన్. సరిహద్దుల్లో శత్రువుల కవ్వింపు చర్యలను తిప్పికొటట్డమే కాదు. మన వ్యూహాత్మక ఆధిక్యతని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ
ఆపరేషన్ తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత్‌ మీదకు మళ్లింది. కేవలం శాంతిని కోరుకునే దేశమే కాదు, తన సార్వభౌమాధికారానికి భంగం కలిగితే, శత్రువు గుండెల్ని చీల్చే ఉన్న దేశమని భారత్ నిరూపించింది. ఇది దౌత్యపరంగానూ భారత్‌కు పెద్ద విజయాన్ని అందించింది. ఒకప్పుడు ఇండియాని ఓ మార్కెట్‌గా మాత్రమే చూసిన ప్రపంచ దేశాలు, ఇప్పుడొక సెక్యూరిటీ ప్రొవైడర్‌గా చూస్తున్నాయ్. క్వాడ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ పోషిస్తున్న పాత్ర కీలకంగా మారింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు.. భారత్‌తో రక్షణ ఒప్పందాల కోసం పోటీ పడుతున్నాయ్. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల్లోనూ.. భారత ైసనికుల సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయ్. ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలు మన క్షిపణులు కొనుగోలు చేస్తుండటం.. మన రక్షణ రంగ ఎదుగుదలకు నిదర్శనం. ఆత్మనిర్భర్‌లో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 30 వేల కోట్ల రక్షణ ఎగుమతులను భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

హిమాలయ మంచు శిఖరాల నుంచి, సముద్ర గర్భాల వరకు.. భారత జవాన్ల పహారా ఈ దేశానికి ఎవరూ ఛేదించలేని రక్షణ కవచం. 77వ రిపబ్లిక్ వేడుకల వేళ, భారత్ ఆత్మవిశ్వాసం కలిగిన, సగర్వమైన సైనిక శక్తి అని గర్వంగా చెప్పొచ్చు. ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లోని మేటి సైన్యాల్లో ముందువరుసలో ఉంది. రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుతుంది.

Story by: Anup , Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×