Illu Illalu Pillalu Today Episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య నాన్న పరువు ఈ ఉంగరం అని అనడంతో వేదవతి తాను అర్థం చేసుకుంది అని సంబరపడిపోతూ ఉంటుంది.. అన్నల ప్రేమని ఈ ఉంగరంలో చూసుకుంటున్నాను అని అమూల్య అంటుంది.. కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగేనేమో కానీ ఇప్పుడు మాత్రం మీ పరువు తీసేలా ఏ పని చేయను అని అంటుంది.. ఆ మాట వినగానే వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక విశ్వం అమూల్యకు పదేపదే ఫోన్లు చేస్తాడు. కానీ విశ్వం ఫోన్లను అమూల్య చూసి కూడా లిఫ్ట్ చేయదు.. అమూల్య కి ఏమైంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని శ్రీవల్లికి విశ్వం ఫోన్ చేస్తాడు.. శ్రీవల్లి వెటకారంగా మాట్లాడుతుంది.. చేతిలో మైక్ ఉంది ఇప్పుడు చెప్పమంటావా అని విశ్వం బెదిరిస్తాడు.. అమూల్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు ఎలా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయో ఏంటో అని శ్రీవల్లి అంటుంది. కానీ విశ్వం మాత్రం ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే.. నువ్వు వెళ్లి ముందు ఫోన్ ఇవ్వు అని అంటాడు. అమూల్య విశ్వం ని ఇంక ఫోన్ చేయొద్దని చెప్తుంది.. కానీ విశ్వం మాత్రం అమూల్యని ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలి అని వేరే ప్లాన్ వేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..విశ్వం తన మనుషులని ఆనందరావు దగ్గరికి పంపిస్తారు. ఆనంద్ రావు భాగ్యంతో కలిసి డ్యూయెట్ సాంగ్ చేయాలనుకుంటాడు.. ఆకుల పసరు లేకపోయినా ఇలాంటి వ్యవహారాలు మాత్రం బాగానే ఉన్నాయి అని భాగ్యం అంటుంది… ముందు వెళ్లి ఇడ్లీ రవ్వ తీసుకురా అని అనగానే ఆనంద్ రావు షాప్ కి వెళ్తాడు. బయట వెళ్లి చూడగానే అక్కడ బాడీగార్డ్స్ ఉండడంతో ఏంటి ఆ విశ్వం నుంచి కాపాడుకోవడానికి మా అమ్మడు బాడీగార్డ్స్ పెట్టిందా ఏంటి అని అనుకుంటాడు. అయితే ఆనందరావు బిల్డప్పు ఇస్తాడు కానీ చివరికి ఆనందంరావును తీసుకెళ్ళిపోవడంతో భాగ్యం షాక్ అవుతుంది.. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా పెళ్లి పత్రికను సెలెక్ట్ చేస్తారు.. మొత్తానికి పూర్తయ్యాయని ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు..
ఇక ఇద్దరు కలిసి చాలా సంతోషంగా బయటికి వస్తారు.. భాగ్యంకు విశ్వం ఫోన్ చేస్తాడు. మీ ఆయనని కిడ్నాప్ చేసింది నా మనుషులే. మా దగ్గర ఇడ్లీ రవ్వ కొనడానికి డబ్బులు లేవు మా ఆయన నీకు కిడ్నాప్ చేస్తే నీకేం వస్తుందిరా దొంగ సచ్చినోడా అని భాగ్యం అంటుంది.. అయినా నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావ్ రా అని భాగ్యం అడుగుతుంది.. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే నాకు అమూల్య దక్కుతుంది అని అంటాడు.. ఇంటి నుంచి పెళ్లికూతుర్ని తీసుకుని రావడం మామూలు విషయం కాదు.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని విశ్వంతో భాగ్యం అంటుంది.
ఏం చేస్తావో నాకు తెలీదు.. నువ్వు మామూలు అని తీసుకొని రా లేదంటే నీ ఇడ్లీ గాని చంపేస్తాను అని విశ్వం వార్నింగ్ ఇస్తాడు. కానీ భాగ్యం మాత్రం టెన్షన్ పడిపోతూ శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా చెప్పు ఎందుకు ఫోన్ చేసావ్ నా టెన్షన్లు నాకు ఉన్నాయి మళ్లీ నువ్వు ఫోన్ చేసి కొత్త టెన్షన్ ఏమైనా పెడుతున్నావని అడుగుతుంది.. మీ నాన్నని ఆ విశ్వం గాడు కిడ్నాప్ చేశాడు అమూల్యని తీసుకురమ్మని అంటున్నాడు ఏం చేయమంటావు అని అడుగుతుంది భాగ్యం. కానీ శ్రీవల్లి మాత్రం ఎక్కడైనా దూకి చావండి నాకు చెప్పకండి అని అంటాడు.. కన్న తల్లిదండ్రులని ఏం మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు అని భాగ్యం ఎంతగా అన్నా సరే శ్రీవల్లి మాత్రం నాకు చెప్పకండి అని అంటుంది.
ఆల్రెడీ సమస్యల్లో ఉన్న నాకు లారీ వచ్చి గుద్దినట్లుగా మళ్లీ లేనిపోని సమస్యలు అయితే ఈ పసిప్రాణం ఎలా తట్టుకుంటుంది దేవుడా అని శ్రీవల్లి అడుగుతుంది. కానీ భాగ్యం మాత్రం ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.. ప్రేమ మాత్రం పెళ్లి పత్రికల షాప్ అతను వాళ్ళిద్దరు పేర్లు వేయించి కార్డు ఇస్తాడు. ఆ కార్డును చూసి మా పెళ్లి కూడా సవ్యంగా జరిగింటే ఇలానే ఉండేది అని ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటుంది.. ఇక తర్వాత నువ్వు నా మెడలో ఎలా తాళికట్టవో తెలుసా అని ప్రేమ ఫీల్ అయిపోతూ ఉంటుంది.. ప్రేమ ఏదో మాట్లాడుతుంది అని ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు. నేను ఎదురింట్లోనే ఉంటాను కదరా నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేదు రా అని ప్రేమ తనలో తానే మాట్లాడుకోవడం చూసినా ధీరజ్ దీనికి ఏమిటి స్క్రూ లూజ్ అయిందని అనుకుంటాడు..
నేను అందంగానే ఉంటాను కదా మనిద్దరం కూడా పెళ్లి చేసుకునే చాలా బాగుండేది కదా. అని ప్రేమ అనుకుంటూ ఉండగానే ధీరజ్ అక్కడ వచ్చి కూర్చుంటాడు.. చెంప పగలగొట్టావు నేను కూడా నీ చెంప పగలగొట్టాలని అనుకున్నాను కానీ నీ బుగ్గలు బూరెల్లా ఉంటాయి కదా కందిపోతాయని ఆగాను అని ప్రేమ అంటుంది.. అయినా కూడా నీ బుగ్గలు గిలా అనిపిస్తుంది అని ధీరజ్ని గిల్లగానే.. కెవ్వు అని అరుస్తాడు.. అది చూసిన ప్రేమ షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది.. మెడలో తాళి కట్టినందుకు నా చెంపలు వాయించాలన్న కోపంగా ఉందని అంటున్నావు అప్పుడే వచ్చాను అని ధీరజ్ అంటాడు..
నువ్వు బయటపడవు కానీ నీ కడుపులో నామీద చాలా ఉందన్నమాట అని ధీరజ్ అంటాడు.. అయితే ప్రేమ పెళ్లి పత్రిక దాచిపెట్టడం చూసిన ధీరజ్ ఏదో దాస్తున్నావు అదేంటి అని అడుగుతాడు. మొత్తానికి వీళ్లిద్దరూ కలిసి కాసేపు గొడవతో కాసేపు ప్రేమతో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తారు. ధీరజ్ ప్రేమని బలవంతంగా అయినా సరే అనుకుంటాడు.. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయేట్ సాంగ్ వస్తుంది.. వీరిద్దరూ కలిసి సరదాగా ఉండడం చాలా బాగుంటుంది.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. దగ్గర్నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు..
నర్మద ప్రేమ ఏదో ఆలోచిస్తూ ఉందని ప్రేమ దగ్గరికి వస్తుంది.. అప్పుడే ధీరజ్ అక్కడికి రావడం చూసి ప్రేమ ఎక్కడుంది ధీరజ్ అని అడుగుతాడు. దాని గురించి నాకు తెలియదు వదిన అని ధీరజ్ అంటాడు. మీ ఆవిడ గురించి నిన్న అడక్కపోతే ఎక్కడ ఎవరిని అడగాలి అని ధీరజ్ని నర్మదా అడుగుతుంది.. తెల్లారితే మీ చెల్లి పెళ్లి ఇప్పుడు ప్రేమ ఇలా ఉంటే ఎలా ఉంటుంది. గత వారం రోజులుగా నువ్వు ప్రేమ కలిసి ఎన్నో పనులు చేశారు. ప్రేమని నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావో నీకు తెలియదా అని ధీరజ్ ని అడుగుతుంది నర్మదా.. తప్పులు చేయకుండా ఉండరు కదా.. మీరిద్దరూ కలిసి ఉంటేనే ఈ పెళ్లి చాలా సంతోషంగా జరుగుతుంది అని నర్మదా అంటుంది.
Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేంద్ర కీలక నిర్ణయం.. దిమ్మతిరిగే షాకివ్వబోతున్న శ్రీయ..
అందరూ సంతోషంగా ఉంటేనే శుభకార్యం బాగా జరుగుతుంది అని నర్మదా అంటుంది. ఇంక నీ ఇష్టం ధీరజ్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. నర్మదా చెప్పిన మాటని ధీరజ్ ఆలోచిస్తాడు.. ప్రేమ దగ్గరికి వెళ్తాడు.. కాఫీ తాగలేదా ఏంటి అలా ఉన్నావు అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అటు ఇటు చూస్తుంది. ధీరజ్ మాత్రం నిన్నే అడుగుతున్నాను. బెర్రీ దాని లాగా ఆ చుట్టుపక్కల చూస్తావ్ ఏంటి కాఫీ తాగలేదా అని అడిగితే సమాధానం చెప్పవేంటి..? నువ్వు ఎందుకు తాగలేదు అని అడిగితే ప్రేమ మనసు బాగోలేదు అని అంటుంది. ప్రేమ ధీరజ్ నుంచి వెళ్ళిపోతుంది.. కానీ ధీరజ్ మాత్రం ఈ పెళ్లి చాలా సంతోషంగా జరగాలని ప్రేమతో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.