E-Paper
Advertisement

రికార్డుల రారాజు.. బయోపిక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! మైఖేల్ మేనియాకు బాక్సాఫీస్ షేక్!

రికార్డుల రారాజు.. బయోపిక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! మైఖేల్ మేనియాకు బాక్సాఫీస్ షేక్!

Michael Biopic : పాప్ ప్రపంచానికి రారాజుగా వెలుగొంది 50 ఏళ్ల వయసులోనే చనిపోయిన మైఖేల్ జాక్సన్ బయో గ్రఫీ వస్తుందంటే ప్రపంచం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసింది. ఎట్టకేలకి ఏప్రిల్ 24న మైకెల్ అనే పేరుతో సినిమా థియేటర్లోకి రానే వచ్చింది.

ఆంటోని ఫుక్వా దర్శకత్వంలో, లయన్స్ గేట్ ఫిల్మ్స్ మరియు జీకే ఫిల్మ్స్ ప్రెస్టేజియస్‌గా నిర్మించిన ‘మైఖేల్’ బయోపిక్.. కేవలం మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నిజానికి ఏదైనా సినిమాకి నెగెటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ విచిత్రంగా సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల వర్షం కురవడం ఆశ్చర్యం. దీని బట్టి తాము ఎంతగానో ఆరాధించే మైకేల్‌ని ఫ్యాన్స్ ఎంత ఉత్సాహం చూపిస్తున్నారో అర్థం అవుతుంది.

మూడు రోజుల్లోనే  217.4 మిలియన్ డాలర్లు

ఈ ఉత్సాహం ఎంతలా ఉందంటే, కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 217.4 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 2049 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ పండిట్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది. అయితే ఇంతటి సక్సెస్‌కి మెయిన్ రీజన్ మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే టైటిల్ రోల్ పోషించిన జాక్సన్ మైకేల్‌ని అచ్చు గుద్దినట్టు దించేయడమే. తన చిన్నాన్న వేసిన డ్యాన్సుల దగ్గర నుంచి, స్టైల్ వరకు ప్రతీదాన్ని అలా మక్కీకి మక్కీ దించేశాడు.

జాక్సన్‌తో పాటు జాఫర్, కాల్మన్ డొమింగో, మైల్స్ టెల్లెర్, లారా హారియర్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకి జాన్ లోగన్ అందించిన స్క్రిప్ట్ మెయిన్ ఎసెట్ అని చెప్పక తప్పదు. ఇక లియర్ రాస్నర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డియాన్ బీబే సినిమాటోగ్రఫీ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మార్చేశాయనడంలో అతిశయోక్తి లేదు.

also read :పూరి మేజిక్ – మహేష్ మాస్: రెండు దశాబ్దాల ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ మెమరీస్!

రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్‌లోనే  లాభాల్లోకి

సుమారు 170 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్‌లోనే పెట్టిన బడ్జెట్‌ని క్రాస్ చేసి లాభాల్లోకి ఎంటర్ అవడం విశేషం. ముఖ్యంగా అమెరికాలో 97 మిలియన్ డాలర్లు, మిగిలిన దేశాల్లో 120.4 మిలియన్ డాలర్లు రాబట్టి బయోపిక్ సినిమాలలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఇంతకు ముందు 180.4 మిలియన్ డాలర్లతో మొదటి ప్లేస్ దక్కించుకున్న ‘ఓపెన్ హైమర్’ రికార్డును మైఖేల్ తుడిచేయడం హాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్.

ఇక ఇండియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న మైఖేల్ జాక్సన్ ఇక్కడ కూడా భారీ వసూళ్లే కొల్లగొడుతున్నాడు. ఐపీఎల్ మ్యాచెస్, కొత్త సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ, తొలి మూడు రోజుల్లోనే ఇండియాలో 16 కోట్ల నెట్ వసూళ్లను (గ్రాస్ రూ. 20 కోట్లు) సాధించిందంటే మైఖేల్ మ్యానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది.

నాలుగో రోజు కూడా ఆ జోరు కంటిన్యూ

ఇక ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా 1.70 కోట్లు, మొదటి రోజు 3.70 కోట్లు, రెండో రోజు 5.10 కోట్లు, మూడో రోజు 5.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా నాలుగో రోజు కూడా ఆ జోరుని కంటిన్యూ చేయడం విశేషం. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం నాలుగో రోజు దాదాపు కోటి 50 లక్షలు వసూలు చేస్తుందని అంచనా.

అయితే ఈ సినిమాలో కేవలం మైఖేల్ జాక్సన్ లైఫ్‌లో జరిగిన పాజిటివిటీని మాత్రమే చూపించారని, కాంట్రవర్సీకి పోలేదని, అలాంటప్పుడు ఇది బయోపిక్ ఎలా అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. చూడాలి మరి సినిమాను మధ్యలోనే ఆపి, సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు కాబట్టి ఆ రెండో భాగంలో అయినా అసలు కథని మొదలెడతారేమో.

ఏది ఏమైనా కింగ్ ఆఫ్ పాప్‌గా క్రేజ్ కొట్టేసిన మైఖేల్ చనిపోయినా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటాడని వస్తున్న వసూళ్లే ప్రూవ్ చేస్తున్నాయ్.

also read :మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లేముందు పిల్లలకి రేణు దేశాయ్ ఏం చెబుతుందో తెలుసా ?

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×