E-Paper
Advertisement

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ
Advertisement

Animated Adventure Movie: గొర్రెలు అంటే సాధు జంతువులు మాత్రమే కాదు, మహా అమాయకమైన జంతువులు. వాటి పని మేత మేయడం మాత్రమే అనుకుంటే పొరపాటే. ‘షాన్ ది షీప్’ ఎంట్రీ ఇచ్చిందంటే అక్కడ నవ్వుల సునామీ పక్కా. ఈసారి హాలోవిన్ ఫెస్టివల్ సందర్భంగా మాసీ బాటమ్ ఫామ్‌ లో షాన్ చేసే ఓ పిచ్చి ప్రయోగం ఊహించని పెద్ద గందరగోళానికి దారి తీస్తుంది. పొలంలో పండించిన గుమ్మడికాయల పంట నాశనం కావడంతో, దాన్ని ఎలాగైనా రిపేర్ చేయాలని షాన్ ఓ క్రేజీ సైంటిస్ట్ లాగా మారిపోతాడు. బట్ ఫైనల్‌ గా ఆ ఎక్స్‌పెరిమెంట్ బెడిసి కొట్టి ఊర్లోకి ఒక భయంకరమైన మృగం రావడంతో రచ్చ మొదలవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనేది తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మాసీ బాటమ్ ఫామ్‌ లో ఉండే జంతువులన్నీ హాలోవిన్ వేడుకల కోసం ఎంతో ఆశగా వెయిట్ చేస్తుంటాయి. ఫామ్‌ లో పండించిన భారీ గుమ్మడికాయల పంట ఆ ఫెస్టివల్‌ కు మెయిన్ హైలైట్. కానీ అనుకోకుండా ఫార్మర్ చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ పంట మొత్తం పాడైపోతుంది. అందరూ టెన్షన్‌ లో ఉంటే, మన స్మార్ట్ షాన్ మాత్రం దానికి ఒక సూపర్ ఐడియా వేస్తానని రంగంలోకి దిగుతాడు. తానేదో గ్రేట్ సైంటిస్ట్ లాగా ఫీలై కొన్ని కెమికల్స్, ట్రిక్స్ యూజ్ చేసి పంటను రిపేర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఎక్స్‌పెరిమెంట్ రివర్స్ అయ్యి ఫామ్ మొత్తం వింత మార్పులకు లోనవుతుంది. అదే టైమ్‌ లో ఆ ఊరి దగ్గరలోని అడవిలో ఒక భయంకరమైన బీస్ట్ తిరుగుతోందని ఊరంతా టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఆ జంతువు ఎక్కడి నుంచి వచ్చిందొ, అది ఫామ్‌పై ఎప్పుడు అటాక్ చేస్తుందోనని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. ఓవైపు ఫార్మర్ మిస్సింగ్ మిస్టరీ ఉంటే, మరోవైపు ఆ భయంకరమైన మృగం నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి షాన్, డాగ్ బిట్జర్ అండ్ బాకీ గొర్రెలన్నీ కలిసి చేసే కామెడీ స్టంట్స్ నవ్వు తెప్పిస్తాయి. మరి ఇంతకీ ఆ బీస్ట్ ఎలా వచ్చింది ? దాని నుంచి ఈ గొర్రెల మంద ఎలా బయట పడింది ? ఫార్మర్ తిరిగి వచ్చాడా లేదా ? అన్నది మూవీ స్టోరీ.

తెలుగులో ఉందా ?

‘షాన్ ది షీప్ ది బీస్ట్ ఆఫ్ మాసీ బాటమ్’ (Shaun the Sheep The Beast of Mossy Bottom) యానిమేటెడ్ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో  (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. అయితే సినిమా రెంటల్ ఆప్షన్‌లో ఉంది. ఇండియన్ వెర్షన్‌ లో తెలుగు ఆడియో లేదా సబ్‌టైటిల్స్ అందుబాటులో లేవు. అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ సాగుతుంది. మాటలు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్, స్లాప్‌స్టిక్ కామెడీతో నడిచే ఈ సినిమా స్టీవ్ కాక్స్, మ్యాథ్యూ వాకర్ డైరెక్షన్‌ లో వచ్చింది. కాబట్టి హ్యాపీగా ఈ వీకెండ్ పిల్లలతో కలిసి ఈ సినిమాపై ఒక లుక్కేయవచ్చు.

Advertisement

Read Also: పారిపోయిన హీరోపై హత్యా నేరం… చనిపోయాడనుకున్న వాడు తిరిగొస్తే… శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రివేంజ్

Related News

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

Big Stories

Advertisement
×