E-Paper
Advertisement

భాగ్య నగరంలో బీజేపీ బిగ్ బాంబ్.. ఇతర పార్టీలోని కీలక నేతలకు భారీ ఆఫర్లు..!

భాగ్య నగరంలో బీజేపీ బిగ్ బాంబ్.. ఇతర పార్టీలోని కీలక నేతలకు భారీ ఆఫర్లు..!
Advertisement

Mission Telangana స్వేచ్ఛ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన అనూహ్యమైన బూస్ట్‌తో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన పూర్తి ఫోకస్‌ను తెలంగాణపైకి మళ్లించింది. ఢిల్లీ పెద్దల కన్ను ఇప్పుడు భాగ్యనగరంపై పడింది. ‘మిషన్ తెలంగాణ’ పేరుతో దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే పరమావధిగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న స్తబ్దతను వీడి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ‘మిషన్ తెలంగాణ’ మంత్రాన్ని వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేడర్‌లో నూతనోత్సాహం..

పశ్చిమ బెంగాల్‌లో సాధించిన ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడ అనుసరించిన దూకుడు వ్యూహాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బెంగాల్ గెలుపు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, అది తెలంగాణలో అధికార మార్పిడికి నాంది అని కేడర్ బలంగా నమ్ముతోంది. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి వేదిక కాబోతోంది. మోడీ రాకతో కేడర్‌లో నూతనోత్సాహం నింపడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. మోడీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారనున్నాయి.

Advertisement

Also Read: కడపలో కిరాతకం.. భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం కలిపి చంపిన భర్త

బీజేపీ ఎత్తుగడలు..

ప్రధాని పర్యటన ముగియడమే తరువాయి.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాషాయ దళం చెబుతోంది. ఇతర పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అసంతృప్త నేతలు, బలమైన ప్రజాబలం ఉన్న నేతలను ఆకర్షించడం ద్వారా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ భారీ చేరికల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులకు దారితీయనుంది. మొత్తానికి, బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడలు చూస్తుంటే తెలంగాణలో రాజకీయ పోరు రసవత్తరంగా మారబోతోందని అర్థమవుతోంది. మోడీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి.

Advertisement

Also Read: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 3 ఎంఎంటీఎస్ స్టేషన్లు!

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

Big Stories

Advertisement
×