E-Paper
Advertisement

Niranjan Reddy: కష్టాలలో ఇండస్ట్రీ.. పార్లమెంటులో ప్రస్తావించిన నిర్మాత నిరంజన్ రెడ్డి!

Niranjan Reddy: కష్టాలలో ఇండస్ట్రీ.. పార్లమెంటులో ప్రస్తావించిన నిర్మాత నిరంజన్ రెడ్డి!
Advertisement

Niranjan Reddy: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే .మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వాల దగ్గర ప్రస్తావించారు. తాజాగా సినీ నిర్మాత రాజ్యసభ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి రాజ్యసభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్షోభంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్…

ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజ్యసభలో సినిమా ఇండస్ట్రీకి సంక్షోభం గురించి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి మాట్లాడారు. 1990 సంవత్సరంలో 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉండేవని 2025 నాటికి ఆరు వేలకు వాటి సంఖ్య పడిపోయిందని తెలిపారు. తెలంగాణలో ఇటీవల సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి గల కారణాలను కూడా ఈయన రాజ్యసభలో ప్రస్తావించారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి కారణాలు..

Advertisement

*ఒకప్పుడు సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు కానీ ఇటీవల కాలంలో థియేటర్ కి వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం ఒక కారణమని తెలిపారు.

*మల్టీప్లెక్స్ థియేటర్లు అందుబాటులోకి రావడం ప్రీమియర్లు కూడా వేయటంతో ఎంతోమంది ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్ లకు దూరం అవుతున్నారని తెలిపారు.

Advertisement

* పెరుగుతున్న టికెట్ ధరలు కూడా ఒక కారణమని నిరంజన్ రెడ్డి తెలిపారు. సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా పెంచడం వల్ల మధ్యతరగతి ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారని తెలిపారు. అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్మాణ ఖర్చులు పెరగటం కూడా కారణమని తెలిపారు.

* కరోనా వచ్చిన సమయంలో ఓటీటీలు అందుబాటులోకి రావటం కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి కారణం అవుతున్నాయని, సినిమా టికెట్లపై 18 శాతం జీఎస్టీ అధిక భారం అవుతుందని తెలిపారు.

*ఇక థియేటర్లలో దొరికే పాప్ కార్న్ కూల్ డ్రింక్స్ ధరలు కూడా అధికంగా పై పెరగటం వల్ల ఈ ప్రభావం సింగిల్ స్క్రీన్ థియేటర్ల పై అధికంగా చూపిస్తుందని ఎంపీ నిరంజన్ రెడ్డి రాజ్యసభ వేదికగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఇలా నిర్మాతగా సినిమా కష్టాలను తెలిసిన వ్యక్తిగా ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను రాజ్యసభలో ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక నిరంజన్ రెడ్డి వృత్తిపరంగా లాయర్ అనే సంగతి మనకు తెలిసిందే.ఈయన నిర్మాతగా ఘాటి, ఆచార్య వంటి సినిమాలను కూడా నిర్మించారు. ఇలా లాయర్ గా నిర్మాతగా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.

Also Read: Venu Swamy: సమంత రెండో పెళ్లిపై వేణు స్వామి కామెంట్స్.. ఈ ట్విస్ట్ ఏందీ సామి!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×