E-Paper
Advertisement

Mouni Roy: అక్కడ చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారు.. బతిమిలాడినా నా మాట వినలేదు.. మౌనీ రాయ్ షాకింగ్ కామెంట్స్..

Mouni Roy: అక్కడ చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారు.. బతిమిలాడినా నా మాట వినలేదు.. మౌనీ రాయ్ షాకింగ్ కామెంట్స్..
Advertisement

Mouni Roy:  బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన మౌనీ రాయ్ స్టేజ్‌ వైపు నడుస్తున్న సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న కొంతమంది పురుషులు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా పేర్కొన్నారు.

“నిన్న కర్నాల్‌లో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ అతిథుల ప్రవర్తన చూసి నాకు చాలా అసహ్యం వేసింది. ముఖ్యంగా తాత..అంకుల్ వయసులో ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన నన్ను షాక్‌కు గురి చేసింది. ఈవెంట్ మొదలై నేను స్టేజ్ వైపు నడుస్తున్నప్పుడు ఫోటోలు తీయాలనే నెపంతో కొంతమంది పురుషులు నా నడుముపై చేతులు వేశారు,” అని చెప్పుకొచ్చింది. దీనిపై తాను అభ్యంతరం తెలిపినప్పుడు వారికి కోపం వచ్చిందని కూడా వెల్లడించారు.

Advertisement

“సర్ దయచేసి మీ చేతిని తీసేయండి అని నేను చెప్పగానే వాళ్లకు అది నచ్చలేదు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది,” అంటూ మౌనీ వివరించారు.

“స్టేజ్‌పై అయితే పరిస్థితి ఇంకా చెడ్డగా మారింది. ముందువరుసలో నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు అసభ్యమైన మాటలు మాట్లాడారు..చెత్త చేతి సంకేతాలు చేశారు, నన్ను పేర్లు పెట్టి పిలిచారు.” మొదట తాను శాంతంగా వారిని ఆపాలని ప్రయత్నించానని ఆమె తెలిపారు.”మొదట నేను మర్యాదగా చేయి చూపించి ఆపమని సంకేతం ఇచ్చాను. అయినా వారు ఆగకుండా గులాబీలు విసిరారు,” అని ఆమె చెప్పారు.

Advertisement

ఈ సమయంలో తాను స్టేజ్ నుంచి వెళ్లిపోవాలనుకున్నానని కానీ ప్రదర్శన పూర్తి చేయాలని మళ్లీ వచ్చానని తెలిపారు. “నేను స్టేజ్ ఎగ్జిట్ వైపు వెళ్లి మళ్లీ వచ్చి నా ప్రదర్శనను పూర్తిచేశాను,” అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తనను తీవ్రంగా అవమానానికి గురి చేసిందని మౌనీ చెప్పారు.

“నా లాంటి వ్యక్తికే ఇలా జరిగితే కొత్తగా రంగంలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే భయంగా ఉంది. నేను అవమానించబడ్డాను, మానసికంగా గాయపడ్డాను. ఈ ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలి. మేము మా కళ ద్వారా నిజాయితీగా జీవనం సాగించాలనుకునే కళాకారులం. మీ కుమార్తెలు, అక్కచెల్లెల్లతో ఎవరో ఇలా ప్రవర్తిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అని ఆలోచించండి. స్టేజ్ ఎత్తుగా ఉండగా కొంతమంది తక్కువ కోణంలో వీడియోలు తీశారు. ఆపమంటే దూషించారు. ఇలా వేధించడం కరెక్ట్ కాదు,” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు

పని విషయానికి వస్తే మౌనీ రాయ్ ఇటీవల ది భూత్నీ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన సలాకార్ సిరీస్‌లో కూడా కనిపించారు.

ALSO READ: Prabhas: ది రాజా సాబ్ డిజాస్టర్.. పీపుల్ మీడియాకు ప్రభాస్ గుడ్ న్యూస్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×