E-Paper
Advertisement

iPhone 18 Leak: సెప్టెంబర్ సెంటిమెంట్‌కు బ్రేక్? ఐఫోన్ 18 లాంచ్ టైమ్ మారింది.. పూర్తి వివరాలు ఇవిగో!

iPhone 18 Leak: సెప్టెంబర్ సెంటిమెంట్‌కు బ్రేక్? ఐఫోన్ 18 లాంచ్ టైమ్ మారింది.. పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

iPhone 18 Leak: టెక్ దిగ్గజం యాపిల్ ప్రతిఏటా సరికొత్త ఐఫోన్లను మార్కెట్లోకి తెస్తూనే ఉంటుంది. ప్రస్తుతం టెక్ ప్రియులందరి కళ్లు iPhone 18 పైనే ఉన్నాయి. ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఐఫోన్ 18 విడుదల తేదీ గురించి, ఫీచర్ల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్, కెమెరా, సరికొత్త AI సాంకేతికతతో యాపిల్ ఈసారి పెద్ద మార్పులకే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్‌లో భారీ మార్పులు..

సాధారణంగా యాపిల్ తన కొత్త డివైజ్‌లను ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తుంది. అయితే iPhone 18 విషయంలో ఈ సంప్రదాయం మారే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 2026లో కేవలం ఐఫోన్ 18 ప్రో మోడల్స్, ఫోల్డబుల్ ఐఫోన్‌ను మాత్రమే కంపెనీ పరిచయం చేయవచ్చు. ఇక బేస్ మోడల్ ఐఫోన్ 18 మాత్రం 2027 ప్రారంభంలో కొత్తగా రాబోయే iPhone 18e తో కలిసి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: ఇకపై మీరే న్యాయనిర్ణేతలు.. నెట్‌ఫ్లిక్స్ లైవ్ ఓటింగ్ వచ్చేసింది.. ఇక ఆ షోలో ఏం జరగాలో మీ చేతుల్లోనే!

శక్తివంతమైన A20 చిప్‌సెట్..

iPhone 18 పర్ఫార్మెన్స్ విషయంలో యాపిల్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ చేస్తోంది. దీనిలో సరికొత్త A20 చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్ 2nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. దీంతో ఫోన్ స్పీడ్ పెరగడమే కాకుండా.. బ్యాటరీ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. గేమింగ్, హెవీ టాస్క్స్ చేసేవారికి ఇదొక గొప్ప అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

కెమెరా సెటప్‌లో క్రేజీ అప్డేట్..

Advertisement

ఐఫోన్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఐఫోన్ 18లో హార్డ్‌వేర్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, సెల్ఫీ లవర్స్ కోసం ఫ్రంట్ కెమెరాను 24MP కి పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు సాఫ్ట్‌వేర్ ఆధారిత కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ ఇంకాస్త మెరుగైన మార్పులు ఉండవచ్చు. అలాగే తక్కువ లైటింగ్‌లో కూడా సూపర్ క్వాలిటీ ఫొటోలు తీసుకునేలా ఇమేజ్ ప్రాసెసింగ్‌ను సంస్థ రీడిజైన్ చేస్తోంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

బ్యాటరీ విషయంలో యూజర్ల నుంచి వచ్చే కంప్లైంట్స్‌కు iPhone 18తో చెక్ పెట్టనుంది యాపిల్. కొత్త చిప్‌సెట్ పవర్ ఎఫిషియన్సీ కారణంగా,  ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇప్పటికై విడుదలైన మోడల్స్ కంటే.. ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా ఆప్టిమైజ్ చేస్తున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమన్వయంతో బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది.

మరింత స్మార్ట్‌గా Siri..

iPhone 18తో పాటు రాబోయే iOS 27 సాఫ్ట్‌వేర్ విభాగంలో విప్లవాత్మక మార్పులు జరగనుంది. ముఖ్యంగా యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ Siriని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు Gemini AI ఫీచర్లను దీనిలో జోడించనుంది. కృత్రిమ మేధ సాయంతో స్మార్ట్‌ఫోన్ వాడకం మరింత సులభతరం కానుంది.

Also Read: 7200mAh బ్యాటరీ, 200MP కెమెరా.. ఫోల్డబుల్ ఫోన్ల రికార్డులు తిరగరాయనున్న హానర్ మ్యాజిక్ V6!

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×