E-Paper
Advertisement

Prabhas: ది రాజా సాబ్ డిజాస్టర్.. పీపుల్ మీడియాకు ప్రభాస్ గుడ్ న్యూస్!

Prabhas: ది రాజా సాబ్ డిజాస్టర్.. పీపుల్ మీడియాకు ప్రభాస్ గుడ్ న్యూస్!
Advertisement

Prabhas: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఈ ఏడాది ఈయన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి. ఇలా రాజాసాబ్ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాకపోవడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు భారీ స్థాయిలో నష్టాలు కూడా వచ్చాయని చెప్పాలి. ఇలా నిర్మాతకు నష్టాలు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్(Prabhas) ఆయనకు అండగా నిలవబోతున్నారని తెలుస్తోంది.

పీపుల్ మీడియాకు తెలుగు థియేట్రికల్ రైట్స్ ..

ప్రభాస్ తదుపరి నటిస్తున్నటువంటి సినిమాలలో స్పిరిట్ (Spirit)సినిమా ఒకటి. సందీప్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ మొత్తం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కైవసం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా రాజా సాబ్ సినిమా ద్వారా నష్టాలను ఎదుర్కొన్న పీపుల్ మీడియా వారికి స్పిరిట్ సినిమా హక్కులను ఇస్తూ కొంతవరకు ఉపశమనం కల్పించబోతున్నారని తెలుస్తోంది .ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని ఈ సినిమా ద్వారా లాభాలు అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆకట్టుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

Advertisement

ఇక స్పిరిట్ సినిమా నుంచి కేవలం ఒక ఆడియో టీజర్ అలాగే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట్ ద్వారానే సందీప్ రెడ్డి భారీగా అంచనాలు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి రూ. 949 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోనుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా హక్కుల పీపుల్ మీడియా వారికి దక్కడంతో ఈ సినిమా ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుందని, రాజా సాబ్ నష్టాల నుంచి స్పిరిట్ సినిమా ఉపశమనం కల్పిస్తుందని చెప్పాలి.

డెహ్రాడూన్ కు స్పిరిట్ బృందం..

Advertisement

ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అయితే త్వరలోనే రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని ఈ చిత్రీకరణ కోసం చిత్ర బృందం డెహ్రాడూన్ వెళ్ళబోతున్నట్టు సమాచారం. దాదాపు 15 రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని మార్చి 25, 2027 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సందీప్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని భద్రకాళి పిక్చర్, టి సిరీస్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Swayambu New Release Date: నిఖిల్ స్వయంభు వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×