Movies In June : ప్రతి నెల కొత్త సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. సంక్రాంతి తర్వాత సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ప్రస్తుతం జూన్ నెలలో స్టార్ హీరోలు సినిమాలో ఎక్కువగా సందడి చేయడం చూస్తూనే ఉన్నాము.. ఈ నెలలోనే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలోకి వచ్చింది.. అదేవిధంగా రీసెంట్ గా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి జనాలు అని బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే జూన్ నెల చివరి వారంలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ నెల చివరి వారంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఒక్కసారి ఇటు చూసేద్దాం పదండి..
గత మూడు వారాలు ఈ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి.. అందులో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ సినిమాలలో కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే విన్నర్గా నిలిచాయి. ఇక జూన్ చివరి వారంలో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి .. మరి ఏ హీరో సినిమా రాబోతుంది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం ఒక్కడు.. ఈ సినిమాలో హీరోయిన్గా భూమిక నటించింది.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. అప్పట్లో ఈ సినిమా ఒక ఊపు ఊపేసింది.. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు..
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప.. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి పెద్దగా రెస్పాన్స్ ని అందుకోలేదు కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే వసూల్ అయ్యాయని తెలుస్తుంది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఈ నెల ఆఖరున సినిమాని మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది..
Also Read :ఏపీ సీఎం ఇంట సంబరాలు.. మరో వారసుడు ఎంట్రీ.. ఇది కదా గుడ్ న్యూస్..
ఇవి మాత్రమే కాదు.. రాజ్ తరుణ్ నటించిన సినిమా చూపిస్తా మావా.. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కూడా రీ-రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా రీ రిలీజ్ కాలేదు.. ఇక వీటితో పాటుగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరోసారి రిలీజ్ అయ్యి థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించాయి. మొదటి ఆరు నెలలు సూపర్ హిట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల రిలీజ్ అయిన గౌతమ్ నంద, ఊసరవెల్లి వంటి చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ సినిమాలైనా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటాయేమో చూడాలి..