E-Paper
Advertisement

‘నాగబంధం’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘నాగబంధం’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Nagabandham Song Update: అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న హై-బడ్జెట్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ‘నాగబంధం’ (The Secret Treasure) విడుదల తేదీ ఒక సాలిడ్ సాంగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక అద్భుతమైన డిజైన్‌తో కూడిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

Read also-Movies In June : జూన్ చివరివారంలో సినిమాల సందడి.. రీ-రిలీజ్‌లదే జోరు..!

జూన్ 26న ‘వీరనాగ’ సాంగ్!

Advertisement

ఈ చిత్రం నుంచి శివభక్తి మరియు ఆధ్యాత్మిక భావనలతో కూడిన పవర్‌ఫుల్ లార్డ్ శివ సాంగ్ ‘వీరనాగ’ ను జూన్ 26వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరో విరాట్ కర్ణ చుట్టూ భారీ సర్పాలు, త్రిశూలాలు, ఉగ్రరూపంలో ఉన్న నాగ సాధువుల మధ్య అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ఈ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక, యాక్షన్ అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది.

Read also-Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..

జూలై 3న గ్రాండ్ రిలీజ్

Advertisement

భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల రహస్యాలు, శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక ఆచారాల నేపథ్యంలో సాగే ఈ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాను 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్-ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

Related News

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రీజన్ లేకుండా ముద్దు పెట్టను.. అనన్య శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై వేటు.. జానీ మాస్టర్ భార్య సుమలతపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం!

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?

దుబాయ్ క్యాన్సిల్.. ముంబైలోనే బన్నీ ‘రాకా’ రచ్చ!

రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!

Big Stories

Advertisement
×