E-Paper
Advertisement

Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!

Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!
Advertisement

Sree vishnu:  శ్రీ విష్ణు ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విభిన్నమైన , కామెడీ నేపథ్యంలో విష్ణు సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శ్రీ విష్ణు హీరోగా విష్ణు విన్యాసం(Vishnu Vinyasam) మృత్యుంజయ (Mrityunjay) అనే సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

ఒకే రోజే శ్రీ విష్ణు సినిమాలు? 

ఇలా ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు సాధారణంగా ఏ హీరో కూడా ఇలాంటి రిస్క్ తీసుకోరు గతంలో బాలకృష్ణ నాని లాంటి హీరోలు ఒకేసారి తమ రెండు సినిమాలను విడుదల చేశారు. ఇక శ్రీ విష్ణు కూడా ఒకేసారి తన రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం ఈ వార్తలను ఖండించారు. మొదట్లో రెండు సినిమాలను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ ఈ ఆలోచనను మాత్రం విరమించుకున్నారని తెలుస్తోంది.

విష్ణు విన్యాసం, మృత్యుంజయ సినిమాల విడుదల..

Advertisement

తాజాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఈ రెండు సినిమాల విడుదలపై ప్రశ్నలు ఎదురవడంతో శ్రీ విష్ణు స్పందిస్తూ తాను ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉన్నానని పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డానని తెలిపారు. మృత్యుంజయ, విష్ణు విన్యాసం సినిమాలు రెండు ఒకేసారి విడుదల కావడం లేదు. ఈ విషయానికి సంబంధించి రేపు అధికారికంగా ప్రకటించబోతున్నామని తెలిపారు.. ఇలా రెండు సినిమాలు వేరువేరుగా విడుదల కావడంతో తాను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాననే భావన కలుగుతోందని తెలిపారు.

హానెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

Advertisement

విష్ణు విన్యాసం సినిమా విషయానికి వస్తే..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మాణంలో మారుతి రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 28వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మృత్యుంజయ సినిమా విషయానికి వస్తే… హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక హానెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా ‘సామజవరగమన’ ఫేమ్ రేబా మోనికా జాన్ హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు.

Also Read: Biker Movie: దిల్ రాజు చేతికి శర్వానంద్ ‘బైకర్ ‘ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×