E-Paper
Advertisement

Mutton Bone Soup: అస్తమానం బయట ఎందుకు? ఇంట్లోనే టేస్టీ మటన్ బోన్ సూప్ ఇలా చేసేయండి!

Mutton Bone Soup: అస్తమానం బయట ఎందుకు? ఇంట్లోనే టేస్టీ మటన్ బోన్ సూప్ ఇలా చేసేయండి!
Advertisement

Mutton Bone Soup: కొన్నిసార్లు వాతావరణ మార్పుల వలనో లేదా ఇతర కారణాల వలనో చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో ప్రతిసారీ మాత్రల మీదే ఆధారపడకుండా.. కొన్ని హోమ్ రెమిడీస్‌తో వైరల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

ముఖ్యంగా జలుబు, దగ్గు తగ్గాలంటే ఇంట్లోనే ఆరోగ్యకరమైన మటన్ బోన్ సూప్ తయారు చేసుకుని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ, గొంతు నొప్పిని తగ్గించే ఈ అద్భుతమైన సూప్‌ను రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా తయార చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: వంట రాని వారు కూడా అదరగొట్టేలా.. సింపుల్ అండ్ స్పైసీ చేపల ఇగురు!

కావాల్సిన పదార్థాలు:

అర కిలో మటన్ బోన్స్ తీసుకోవాలి. దీనికి రెండు చెంచాల నెయ్యి, కప్పు ఉల్లిపాయ తరుగు, 2 టమోటాలు, 4 నుండి 5 పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. మసాలా దినుసుల కోసం 3 బిర్యానీ ఆకులు, అర స్పూన్ షాజీరా, ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు అవసరమవుతాయి. రుచి కోసం అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటితో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర కప్పు పుదీనా, అర కప్పు కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకును దగ్గర పెట్టుకోండి.

తయారీ విధానం:

Advertisement

స్టవ్ మీద కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకులు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రంగు మారే వరకు వేపి, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి పచ్చివాసన పోనివ్వాలి. ఇప్పుడు మటన్ ఎముకలు వేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

ఈ తర్వాత టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఎముకలు మునిగేలా తగినన్ని నీళ్లు పోసి, మిరియాల పొడి చల్లి కుక్కర్ మూత పెట్టి ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎముకల్లోని సారం అంతా నీటిలోకి దిగి సూప్ చిక్కబడ్డాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Also Read: మైదా లేకుండా హెల్దీ పన్నీర్ రోల్స్.. ఈ సీక్రెట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×