E-Paper
Advertisement

Mrithyunjay: ఈ జిందగీ, చాలా చిన్నది.. ‘మృత్యుంజయ్’‌కి రామ్ హెల్ప్!

Mrithyunjay: ఈ జిందగీ, చాలా చిన్నది.. ‘మృత్యుంజయ్’‌కి రామ్ హెల్ప్!
Advertisement

Mrithyunjay: శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ (Reba Monica John) ఈ చిత్రంలో మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేయగా, బుధవారం ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ (Ee Zindagi)ని విడుదల చేశారు. ఈ పాట స్పెషల్ ఏంటంటే.. హీరో రామ్ (Ram Pothineni) సపోర్ట్ అందించడం.

Also Read- Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..

భగవద్గీత శ్లోకంతో మొదలై..

Advertisement

అవును, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయించారు. ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన రామ్.. టీమ్‌కు బెస్ట్ విషెస్‌ను అందించారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా, శ్రీవిష్ణులోని పలు కోణాలను తెలియజేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు పలు అవతారాలలో కనిపిస్తుండటం విశేషం. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. కాల భైరవ అందించిన బాణీ, అభినవ కవి ర్యాప్ వెర్షన్ సాంగ్‌ని రిపీట్ మోడ్‌లో వినేలా చేస్తున్నాయి. అభినవ కవి, కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అయితే జీవితం, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి గొప్పగా చాటి చెబుతోంది. అందుకే ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- SS Rajamouli: హైదరాబాద్‌లోనే అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సౌకర్యం.. ఆవిష్కరించిన దర్శకధీరుడు!

అన్నీ రకాల ఎమోషన్స్‌తో

Advertisement

హీరో శ్రీ విష్ణు తన గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు, ఆ పనులతో వాళ్లకి ఎదురైన సవాళ్లు, వారి స్నేహ బంధం ఇలా అన్నీ రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించినట్లుగా ఈ లిరికల్ వీడియో తెలియజేస్తుంది. ఈ పాటకు ఆదిత్య అయ్యంగార్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ‘మృత్యుంజయ్’ మూవీని 6 మార్చి, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ విష్ణు శైలిలో రూపొందిన ఈ థ్రిల్లర్ మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టీమ్ హామీ ఇస్తోంది. అందులోనూ వారం గ్యాప్‌లోనే శ్రీవిష్ణు నుంచి రెండు సినిమాలు రాబోతుండటంతో.. మరింత ఆసక్తి ఏర్పడింది. రెండు సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ.. శ్రీవిష్ణు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Also Read- Samantha: రాజమౌళి ఈగ సినిమాపై సమంత కామెంట్స్…సెకండ్ ఛాన్స్ వస్తే అంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×