Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగం బిజీగా ఉండటమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత, సుదీప్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈగ. ఈ సినిమా 2012 జూలై 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈగ కాన్సెప్ట్ తో అప్పటివరకు ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాని నేపథ్యంలో ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో సమంత నాని ప్రేమికులుగా ఉండగా నాని చనిపోవడంతో ఈగ రూపంలో రావడం అందరిని ఆకట్టుకుంది.
ఈ సినిమా గురించి తాజాగా సమంత మాట్లాడుతూ.. రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ఈగ అని తెలిపారు. ఈగ సినిమాకు రెండో ఛాన్స్ వస్తే బాగుండేదని తెలిపారు ఈగ సినిమా అప్పట్లో విడుదల కావాల్సిన సినిమా కాదని ఇప్పుడు కనుక ఈ సినిమా విడుదలై ఉంటే ఇంకా మంచి సక్సెస్ అందుకునేదని సమంత తన అభిప్రాయాన్ని తెలియజేశారు. చిన్న ఈగలు రాజమౌళి నాని హవ భావాలను అద్భుతంగా పలికించారంటూ ఈమె కొనియాడారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఈగ బెస్ట్ ఫిలిం అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
గ్లోబల్ స్థాయిలో వారణాసి విడుదల..
రాజమౌళి డైరెక్షన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ చాలామంది ఈగ సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. ఇక సమంత ఈగ సినిమాలో మినహా రాజమౌళి సినిమాలలో తదుపరి నటించలేదు. ఇక రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారనాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సగభాగం షూటింగ్ పూర్తి అయిందని మరొక ఆరు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ ఏడో తేదీ విడుదల చేయడానికి చిత్రం బృందం సిద్ధమయ్యారు ప్రస్తుతం జార్జియాలో వారణాసి సినిమా షూటింగ్ జరుగుతుంది.
Also Read: Star Actor: పాకెట్ మనీ కావాలంటే భార్యను అడగాల్సిందే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!