E-Paper
Advertisement

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్, ఈ కొలువు వస్తే లైఫ్ సెట్

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్, ఈ కొలువు వస్తే లైఫ్ సెట్
Advertisement

నిరుద్యోగులకు.. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ విభాగాల్లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) ఖాళీగా ఉన్న మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 419 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

వివిధ విభాగాల్లో వెకెన్సీలు.. 

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక బాధ్యతలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిపుణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విద్యార్హత వివరాలివే. 

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు ఎంబీఏ (MBA), పీజీడీఎం (PGDM), సీఏ (CA), సీఎఫ్‌ఏ (CFA) లేదా సీఎంఏ (CMA) వంటి వృత్తిపరమైన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి.. 

దరఖాస్తుదారుల వయస్సు పోస్టును అనుసరించి 22 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (OBC) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PH) 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు..

ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850.

రిజర్వ్‌డ్ కేటగిరీ: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజుగా నిర్ణయించారు.

ఉద్యోగ ఎంపిక విధానం.. 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్స్ పరిశీలించిన అనంతరం, మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారిని తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://bankofbaroda.bank.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×