Mrithyunjay: ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam)తో ఈ శుక్రవారం సందడి చేసిన కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) నుంచి వారం గ్యాప్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) పేరుతో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో మరోసారి హీరో, హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ హీరో ఎవరో కాదు..
Also Read- Puri jagannadh: సూర్య పూరి జగన్నాథ్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR) చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ చిత్ర ట్రైలర్ విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తారక్, ఈ చిన్న చిత్రానికి మద్దతు తెలపడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. రేపు (ఫిబ్రవరి 28) ఉదయం 11 గంటలకు విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, ఈ సినిమా ఒక విభిన్నమైన కథాంశంతో, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ‘గెట్ ఏ పీక్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ మృత్యుంజయ్’ అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.
Also Read- Hero Vijay Divorce: విజయ్‌కు భార్య షాక్.. పెళ్లయిన 26 ఏళ్లకు విడాకులు, ఆ రూమర్లే కారణమా?
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రోత్సహించడం చిత్ర యూనిట్‌కు పెద్ద బూస్ట్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు. శనివారం ఉదయం విడుదలయ్యే ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ, ఎన్టీఆర్ ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తుండటం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అప్టేడ్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను హీరో రామ్ పోతినేని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక వైపు మాస్ ఎలిమెంట్స్, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ‘మృత్యుంజయ్’ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?
#MrithyunjayTrailer Launch by none other than The Man of Masses – @tarak9999 🔥
11AM | Tomorrow – Get a peek into The world of #Mrithyunjay#MrithyunjayOnMarch6th@sreevishnuoffl @Reba_Monica @HussainShaKiran @kaalabhairava7 @sreekar_prasad @vidya7sagar @SunnyGunnam… pic.twitter.com/eDxEiZRQ2z— Vamsi Kaka (@vamsikaka) February 27, 2026
Also Read- Varanasi: మహేష్ బాబు సినిమా కోసం తెగ కష్టపడుతున్న స్టార్ హీరోయిన్.. రాజమౌళి ప్లాన్ అదుర్స్..!