E-Paper
Advertisement

Pakistan Afghanistan War: పాక్ Vs అఫ్గాన్.. యుద్ధం వస్తే పైచేయి ఎవరిది? బలాబలాలు ఏమిటీ?

Pakistan Afghanistan War: పాక్ Vs అఫ్గాన్.. యుద్ధం వస్తే పైచేయి ఎవరిది? బలాబలాలు ఏమిటీ?
Advertisement

Pakistan Afghanistan War: పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు బహిరంగ యుద్ధానికి దారితీసింది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గురువారం రాత్రి భీకర దాడులతో ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’ వేదికగా  అఫ్గానిస్థాన్‌పై బహిరంగ యుద్ధం ప్రారంభమైనట్లు ప్రకటించారు. “మా సహనం నశించింది.. ఇకపై మాకు.. మీకు మధ్య యుద్ధమే” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అఫ్గాన్ దాడులకు ప్రతిచర్యగా పాక్ వైమానిక దళం ‘ఆపరేషన్ గజబ్‌ లిల్‌ హక్‌’ పేరుతో విరుచుకుపడుతోంది.

అంతర్జాతీయ సంస్థలైన గ్లోబల్ ఫైర్‌పవర్ ఐఐఎస్ఎస్ గణాంకాల ప్రకారం సైనిక శక్తిలో పాకిస్థాన్ తిరుగులేని ఆధిక్యంలో ఉంది. 2026 నాటి గ్లోబల్ మిలిటరీ ర్యాంకింగ్స్‌లో పాక్ 14వ స్థానంలో ఉండగా.. అఫ్గాన్ 121వ స్థానానికి పరిమితమైంది. పాకిస్థాన్ వద్ద సుమారు 6,60,000 మంది క్రియాశీలక సైనికులు ఉండగా.. అఫ్గాన్ బలం కేవలం 1.72 లక్షలు మాత్రమే. ముఖ్యంగా వైమానిక రంగంలో పాక్‌కు ఎక్కడా పోటీ లేదు. పాక్ వద్ద 465 యుద్ధ విమానాలు.. 260కి పైగా హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అఫ్గాన్ కేవలం అమెరికా విడిచి వెళ్లిన 70 పాత విమానాలతో పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

ఆర్థికంగా, సాంకేతిక పరంగా కూడా పాకిస్థాన్ భారీ ఆధిక్యంలో ఉంది. పాక్ రక్షణ బడ్జెట్ 12 బిలియన్ డాలర్లు కాగా, అఫ్గాన్ బడ్జెట్ కేవలం 2 బిలియన్ డాలర్లే. వీటన్నింటికీ మించి పాక్ వద్ద ఉన్న 170 అణ్వాయుధాలు ఆ దేశానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అఫ్గాన్ భూపరివేష్టిత దేశం కావడంతో నౌకాదళం లేకపోవడం మరో బలహీనత. పాక్ మాత్రం 30 వేల మంది నావికా సిబ్బందితో సముద్ర మార్గాల్లోనూ పటిష్టంగా ఉంది. చైనా వంటి దేశాల సాంకేతిక సహకారం పాక్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

యుద్ధం సంభవిస్తే సంఖ్యాపరంగా పాకిస్థాన్‌దే పైచేయి అయినప్పటికీ, అఫ్గాన్ భౌగోళిక పరిస్థితులు, గెరిల్లా పోరాట అనుభవం యుద్ధ గమనాన్ని మార్చే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్ గడ్డపై దండయాత్ర చేసిన అగ్రరాజ్యాలే గతంలో వెనక్కి తగ్గిన చరిత్ర ఉంది. సరిహద్దుల్లో ‘ఆపరేషన్ గజబ్‌ లిల్‌ హక్‌’ వేగంగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పొరుగు దేశాల జోక్యం.. అంతర్జాతీయ దౌత్యం ఈ యుద్ధ ఫలితాన్ని శాసించనున్నాయి.

Read Also: పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం.. 70 మంది ఉగ్రవాదులు, 55 మంది పాక్ సైనికులు మృతి!

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×