E-Paper
Advertisement

Mrunal Thakur: స్టార్ హీరో వల్ల మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. బయటపడిన నిజం..!

Mrunal Thakur: స్టార్ హీరో వల్ల మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. బయటపడిన నిజం..!
Advertisement

Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న చిత్రం కూడా అమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అనుభవాన్ని షేర్ చేశారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మృణాల్ తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్న రోజుల గురించి మాట్లాడుతూ, అప్పట్లో తాను సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉండేదానని చెప్పారు. హీరోలతో కలిసి పనిచేయడం ఆమె వృత్తిలో భాగమే అయినా.. అది తన అప్పటి బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చలేదట. ఆమె సినిమా రంగంలో ఎదుగుతుండటం.. ప్రముఖ నటులతో కలిసి కనిపించడం అతనిలో అసూయను పెంచిందని మృణాల్ తెలిపింది.

Advertisement

ఆ అసూయ కారణంగా అతను తనను తాను హీరోలతో పోల్చుకోవడం మొదలుపెట్టాడట. తన లుక్ మీద ఎక్కువ దృష్టి పెట్టి జిమ్‌కి వెళ్లడం ప్రారంభించాడని చెప్పారు. రోజూ కష్టపడి వ్యాయామం చేసి..ఆహారంపై కంట్రోల్ పెట్టి సుమారు 15 కిలోల వరకు బరువు తగ్గాడట. తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవాలని ప్రయత్నించాడని మృణాల్ తెలిపింది.

కానీ ఈ మార్పు ఎక్కువకాలం నిలవలేదట. కొంతకాలం తర్వాత అతనికి ఆ డిసిప్లిన్ మీద ఆసక్తి తగ్గిపోయింది. జిమ్‌కు వెళ్లడం మానేసి, మళ్లీ సాధారణ జీవితం వైపు వెళ్లడంతో బరువు పెరిగిపోయాడట. అప్పుడు అతను తనతో, “ఇలా హీరోలతో పోల్చుకుంటూ ఉండడం నావల్ల కావట్లేదు” అని చెప్పినట్లు మృణాల్ గుర్తు చేసుకుంది.

Advertisement

ఈ అనుభవంపై స్పందిస్తూ మృణాల్.. తాను ఎప్పుడూ అతనిని బరువు తగ్గమని అడగలేదని, కండలు ఉన్నవాడినే ప్రేమించాలి అనే ఆలోచన తనకు లేదని చెప్పారు. ఇది పూర్తిగా అతనిలోని అసూయ వల్ల వచ్చిన ఒత్తిడే తప్ప, తన వల్ల కాదని ఆమె చెప్పుకొచ్చింది. “ ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోతే ఆ రిలేషన్‌షిప్ ఎక్కువకాలం నిలవలేదు. అందుకే కొద్దిరోజుల తర్వాత అతనితో బ్రేకప్ అయ్యింది,” అని తెలిపింది మృణాల్.
ప్రస్తుతం మృణాల్ తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు.

ALSO READ: Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి పనులు షురూ.. అందంగా ముస్తాబైన విజయ్ ఇల్లు!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×