E-Paper
Advertisement

Sarpanch Nominations: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

Sarpanch Nominations: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి
Advertisement

Sarpanch Nominations: తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు హుషారుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ నుంచి ప్రజల్ని ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలో ఓ అభ్యర్థి వెయ్యి రూపాయి నాణేలతో నామినేషన్ దాఖలు చేస్తే తాజాగా మరో అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

వినూత్నంగా నామినేషన్

పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రెండో విడతగా సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. మండలాన్ని ఆరు క్లస్టర్‌లుగా విభజించి నామినేషన్లు స్వీకరించారు. జోగిపేట అక్సాన్‌పల్లి క్లస్టర్‌లో తాడ్మన్నూర్‌ పంచాయతీకి చెందిన కాంగ్రెస్‌ మద్దతుదారుడు పట్లోళ్ల వీరారెడ్డి(నాని) గుర్రంపై వచ్చి అట్టహాసంగా నామినేషన్‌ను దాఖలు చేశారు.

రెండు గుర్రాలతో

Advertisement

పటోళ్ల వీరారెడ్డి రెండు గుర్రాలు తెప్పించి ఒక గుర్రంపై తాను కూర్చొని తాడ్మన్నూర్‌ నుంచి అక్సాన్‌పల్లి వరకు వందల సంఖ్యలో మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. అభిమానులు గజమాలతో పటోళ్లకు స్వాగతం పలికి, వాహనంపై ఊరేగించారు. వందల సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, యువకులు తరలిరావడంతో సాధారణ ఎన్నికలను తలపించేలా ర్యాలీ నిర్వహించారు.

Also Read:

25 పంచాయతీ స్థానాలకు

Advertisement

అలాగే అల్మాయిపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు మాజీ సర్పంచ్‌ రవిశంకర్‌ వందల సంఖ్యలో తన మద్దతుదారులతో వచ్చి, జోగిపేట ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. అందోలు మండలంలో 25 పంచాయతీ స్థానాలకు గాను 19 మంది సర్పంచ్‌ స్థానానికి, 45 మంది వార్డు మెంబర్ల స్థానానికి నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు.

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×