E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: సమంత రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. అన్నేళ్లు చిన్నదా?

Samantha -Raj Nidimoru: సమంత రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. అన్నేళ్లు చిన్నదా?
Advertisement

Samantha -Raj Nidimoru: సినీ నటి సమంత (Samantha)రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. సమంత సినీ నటుడు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఈమె గత కొద్ది రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో రిలేషన్ లో ఉన్నారు కానీ వీరి రిలేషన్ గురించి అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదు అయితే తాజాగా వీరిద్దరూ ఈషా ఫౌండేషన్ లోని యోగ ఆశ్రమంలోని లింగ బైరవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సమంత అధికారికంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రాజ్ కంటే 8 ఏళ్లు చిన్నది..

ఈ విధంగా సమంత పెళ్లి చేసుకోవడంతో సమంతకు, రాజ్ కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి వీరిద్దరూ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు ఈశా ఫౌండేషన్ వారు కూడా అధికారకంగా తెలియజేశారు అయితే సమంత రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ (Age Gap)గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సమంత వయసులో రాజ్ కంటే కూడా ఏకంగా 8 సంవత్సరాలు చిన్నదని తెలుస్తోంది. రాజ్ నిడిమోరు ఆగస్టు 4 1979 వ సంవత్సరంలో జన్మించారు. ఇకపోతే సమంత 1987 ఏప్రిల్ 28వ తేదీ జన్మించారు. ఇలా వీరిద్దరి మధ్య 8 సంవత్సరాలు వయసు తేడా ఉందని తెలుస్తోంది.

కొత్త జంటకు అభినందనలు..

Advertisement

ప్రస్తుతం సమంత రాజ్ పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సమంత రాజ్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే.

ఇద్దరికీ రెండవ పెళ్లి..

Advertisement

రాజ్ ఇదివరకు శ్యామలి దే అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరి వివాహం 2015 వ సంవత్సరంలో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె జన్మించారు. అయితే 2022వ సంవత్సరంలో వీరిద్దరూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంత కూడా నాగచైతన్యను 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని 2021 వ సంవత్సరంలో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాల పాటు నాగచైతన్య ప్రేమలో ఉన్న సమంత పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోవడం గమనార్హం. ఇలా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం మరో దర్శకుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారని చెప్పాలి.

Also Read: Kiran Abbavram: గుండె ముక్కలైంది..అన్న మరణం పై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×