E-Paper
Advertisement

Kaantha OTT: అప్పుడే ఓటీటీకి ‘కాంత’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Kaantha OTT: అప్పుడే ఓటీటీకి ‘కాంత’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!
Advertisement

Kaantha OTT Release: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కాంత‘. టాలీవుడ్‌ భళ్లాలదేవ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించాడు. పీయారిడికల్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య తమిళ్‌, తెలుగు, మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. 1950 కాలం నాటి మద్రాస్‌లో ప్రముఖ నటుడు, అతని దర్శకుడు మధ్య జరిగే ఇగో క్లాష్‌ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

రిలీజ్ కి ముందే ఓటీటీ డీల్

Advertisement

వరుస సక్సెస్‌తో దూసుపోతున్న దుల్కర్‌కి ఈ సినిమా బ్రేక్‌ వేసింది. కనీసం రిటర్న్స్‌ కూడా రాబట్టేకపోయింది కాంత. థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. దుల్కర్‌ పై ఉన్న నమ్మకం, ఆయన సక్సెస్‌ రేట్‌పై ఉన్న ధీమాతో థియేట్రికల్‌ రిలీజ్‌కి ముందే కాంత ఓటీటీ డీల్ జరిగింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తుంది.

అప్పుడే స్ట్రీమింగ్..

ఓటీటీ ఒప్పందం ప్రకారం మూవీని నెల రోజుల్లోనే డిజిటల్‌ ప్రీమియర్‌కు ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 12న కాంత నెట్‌ఫ్లిక్స్‌ విడుదల కానుంది. అయితే దీనిపిఐ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు. కానీ, డిసెంబర్‌ 12న కాంత ఓటీటీకి రాబోతుందని సోషల్‌ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది. ఇదే డేట్‌ని ఫిక్స్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ కూడా త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి డిసెంబర్‌ 12న కాంత ఓటీటీకి వస్తుందా? రాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సెల్వమని సెల్వరాజ్‌ దర్శకత్వంలోతమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. దీనికి దుల్కర్‌ సల్మాన్‌, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ పోట్లూరితో నిర్మాతలుగా వ్యవహరించారు. రామా నాయుడు స్టూడియో భాగస్వామ్య సంస్థలో ఒకటైన స్పిరిట్ మీడియా ద్వారా కాంతను తెలుగులో సమర్పించారు.

Advertisement

Also Read: Samantha-Raj Nidimoru Assets: రాజ్‌ నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!

వివాదం ఏమిటంటే

అయితే ఈ సినిమాను తమిళ సినీ దిగ్గజం ఎంకె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కినట్టుగా కోలీవుడ్‌లో ప్రచారం ఉంది. కానీ, ఇది పూర్తి కల్పిత కథ అని మూవీ టీం మొదటి నుంచి చెప్పుకొస్తుంది. కానీ, ఈ సినిమా కథ, ఎంకె త్యాగరాజ భాగవతార్ చాలా దగ్గర ఉండటంతో ఆయన మనవడు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో మా తాత గారిని తప్పుగా చూపించారని, ఎం.కె. త్యాగరాజన్ మనవడు కోర్టు మెట్లు ఎక్కాడు. తన తాత అప్పుల్లో చనిపోయినట్లు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ కథలో ఒక నటుడికి, తనను పరిచయం చేసిన దర్శకుడితో వివాదం మొదలవుతుంది. హీరో తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చానని చెప్పడంతో దర్శకుడి ఇగో హార్ట్ అవుతుంది. దర్శకుడు మాత్రం నేను డైరెక్ట్ చేయడం వల్లే నీకు ఇంత పేరు వచ్చిందని వాదనలు జరుగుతాయి. మధ్యలోవచ్చే మరిన్ని పాత్రలు కథకి మరింత బలాన్ని ఇచ్చాయి.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×