E-Paper
Advertisement

Mrunal Thakur: అల్లు అర్జున్ సినిమాలో మృణాళ్ ఠాకూర్…గ్రాండ్ పార్టీ ఇస్తానన్న బ్యూటీ!

Mrunal Thakur: అల్లు అర్జున్ సినిమాలో మృణాళ్ ఠాకూర్…గ్రాండ్ పార్టీ ఇస్తానన్న బ్యూటీ!
Advertisement

Mrunal Thakur: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. దాదాపు 50% షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించని విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి.

బన్నీ సినిమాలో దీపికా పదుకొనే..

ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone)హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీపికా తో పాటు ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్, రష్మిక వంటి తదితరులు నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే నటి మృణాళ్ ఠాకూర్ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

నేను అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నానా?

Advertisement

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటించబోతున్నారనే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు మృణాళ్ సమాధానం చెబుతూ..అవునా? నేను నిజంగానే అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నానా? ఇది నిజమవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకోండి ఇదే కనుక నిజమైతే కచ్చితంగా మరోసారి మీతో ఇంటర్వ్యూ చేసి ఇక్కడే గ్రాండ్ పార్టీ ఇస్తాను అంటూ ఈమె మాట్లాడారు. ఈ విధంగా మృణాళ్ ఠాకూర్ అల్లు అర్జున్ సినిమాలో నటించడం గురించి స్పందించడంతో ఈ వార్తలలో నిజం లేదని స్పష్టం అవుతుంది.

విడుదలకు సిద్ధంగా డెకాయిట్..

Advertisement

ఇక ఈమె ఈ సినిమాలో నటించడం లేదంటూ క్లారిటీ రావడంతో ఈమె అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక ఈమెకు కూడా అలాంటి అవకాశం వచ్చిందని ఇన్ని రోజులు అభిమానులు భావించారు కానీ అది నిజం కాదని తెలియడంతో బన్నీ సినిమాలో ఈమెకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారు.. ఇక ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే మృణాళ్ నటించిన డెకాయిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read: S.SRajamouli: జేమ్స్ కామెరూన్ తో రాజమౌళికి పోలిక.. జక్కన షాకింగ్ రియాక్షన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×